హైదరాబాద్, డిసెంబర్ 9: గత నాలుగేండ్లకాలంలో భారత్ మార్కెట్లోకి జరిగిన బంగారం సరఫరాల్లో 86 శాతం దిగుమతులే ఉన్నాయని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ (డబ్ల్యూసీజీ) నివేదిక తెలిపింది. పుత్తడిపై అధిక సుంకాలు విధించినప్పటికీ, 2016-2020 మధ్యకాలంలో దిగుమతులు పెరిగాయన్నది. 2012లో బంగారంపై దిగుమతి సుంకాల్ని తొలిసారిగా పెంచినప్పటి నుంచి 2020 వరకూ భారత్..ఏడాదికి సగటున 730 టన్నుల చొప్పున మొత్తం 6,581 టన్నుల దిగుమతులు జరిగాయని డబ్ల్యూసీజీ ‘బులియన్ ట్రేడ్ ఇన్ ఇండియా’ నివేదికలో వెల్లడించింది.