హైదరాబాద్, డిసెంబర్ 27: ఐకియా ప్రకటించిన ప్రత్యేక ఆఫర్లు వచ్చే నెల 15 వరకు అమలులో ఉండనున్నాయి. వార్షిక సేల్ సందర్భంగా సంస్థ పలు రాయితీలు ఇస్తున్న విషయం తెలిసిందే. ఈ ఆఫర్లు హైదరాబాద్, ముంబైలో ఉన్న స్టోర్లతోపాటు ఆన్లైన్లో సేవలు అందిస్తున్న పుణె, బెంగళూరు, సూరత్, అహ్మదాబాద్, వడొదర నగరాలకు కూడా వర్తించనున్నట్టు పేర్కొంది. గృహోపకరణాలపై 40 శాతం వరకు రాయితీని ఇస్తున్నది.