సంగారెడ్డి కలెక్టరేట్, డిసెంబర్ 13: రాజస్థాన్ ప్రభుత్వం కోసం ఏఐ ఆధారిత ఖనిజ అన్వేషణ వ్యవస్థను ఐఐటీ హైదరాబాద్ అభివృద్ధి చేయనున్నది.
భారతదేశ ఖనిజ అన్వేషణ పర్యావరణ వ్యవస్థను ఆధునీకరించే క్రమంలో భాగంగా రాజస్థాన్లో జైపూర్ ఎగ్జిబిషన్ అండ్ కన్వెన్షన్ సెంటర్లో శనివారం జరిగిన ప్రవాసీ రాజస్థానీ దివస్-2025 సందర్భంగా అధునాతన ఏఐ ఖనిజ అంచనా వేదికను అభివృద్ధి చేసేందుకు ఐఐటీ హైదరాబాద్ పరస్పర ఒప్పందం కుదుర్చుకున్నది.