హైదరాబాద్, సెప్టెంబర్ 24: దేశంలో అతిపెద్ద నాన్-బ్యాంకింగ్ ఆర్థిక సేవలు అందిస్తున్న సంస్థల్లో ఒకటైన ఐఐఎఫ్ఎల్ ఫైనాన్స్ మళ్లీ బంగారం రుణాలు ఆరంభించింది. మూడు నెలల క్రితం రిజర్వు బ్యాంక్ నిషేధం విధించడంతో రుణాలను నిలిపివేసిన సంస్థ..ఇటీవల సెంట్రల్ బ్యాంక్ తిరిగి అనుమతించడంతో మళ్లీ యథావిధిగా సేవలు ప్రారంభించింది.
ఇదే అదనుగా కస్టమర్లను ఆకట్టుకోవడానికి ‘గోల్డ్ లోన్ మేళా’ పేరుతో ప్రత్యేక స్కీం అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ స్కీం కింద కేవలం ఒక్క శాతం వడ్డీకే గోల్డ్ లోన్లను మంజూరు చేయనున్నట్లు ఐఐఎఫ్ఎల్ గోల్డ్ లోన్ హెడ్ సౌరభ్ కుమార్ తెలిపారు. అలాగే ప్రాసెసింగ్ ఫీజును కూడా ఎత్తివేసినట్లు చెప్పారు. ఈ నెల 30 వరకు ఈ ప్రత్యేక ఆఫర్ అందుబాటులో ఉండనున్నదని వెల్లడించింది.