న్యూఢిల్లీ, డిసెంబర్ 19: తాజ్ జీవీకే హోటళ్ల నుంచి ఇండియన్ హోటల్స్ కంపెనీ లిమిటెడ్ వైదొలిగింది. కంపెనీలో తనకున్న 25.52 శాతం వాటాను జీవీకే-భూపాల్ ఫ్యామిలీకి విక్రయించింది. దీంతో ఐహెచ్‌సీఎల్ జాయింట్ వెంచర్ నుంచి వైదొలిగినట్టు అయింది. ఈ జాయింట్ వెంచర్ నుంచి ఐహెచ్‌సీఎల్ ఎగ్జిట్ కావడంతో జీవీకే-భూపాల్ ఫ్యామిటీ 74.99 శాతం వాటాలో ప్రమోటర్లుగా కొనసాగనున్నారు.
ఈ సందర్భంగా తాజ్ జీవీకే హోటల్స్ అండ్ రిసార్ట్స్ లిమిటెడ్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ కృష్ణ భూపాల్ మాట్లాడుతూ..రెండు దశాబ్దాల పాటు ఇరు సంస్థలు కలిసి ఆతిథ్య రంగంలో సుస్థిరమైన స్థానం సాధించినట్లు, దేశవ్యాప్తంగా 1,500 గదులతో ఏడు హోటళ్లను నిర్వహిస్తున్నట్టు చెప్పారు. భవిష్యత్తు వ్యాపార విస్తరణలో భాగంగా బెంగళూరులో నెలకొల్పుతున్న తాజ్ వచ్చే ఏడాది అందుబాటులోకి రానున్నట్టు చెప్పారు. వచ్చే ఐదేండ్లలో 4 వేలకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు ఆయన చెప్పారు.