iPhone 16 | ఆపిల్ ఐ-ఫోన్లు.. ఐపాడ్లు, ఆపిల్ వాచ్లు అన్నా ప్రతి ఒక్కరిలోనూ ఆసక్తి నెలకొంటుంది. ఐ-ఫోన్లు మొదలు ఆపిల్ ఉత్పత్తుల ధరలు ఎక్కువగా ఉన్నా, వాటిల్లో ఫీచర్ల గురించి తెలుసుకోవడానికి ప్రాధాన్యం ఇస్తుంటారు. ఆపిల్ తన ఐ-ఫోన్ 16 మోడల్ ఫోన్లను సెప్టెంబర్ 10న ఆవిష్కరించనున్నది. ఆపిల్ ఐ-ఫోన్ 16 లతోపాటు కొత్తగా ఆపిల్ వాచ్, ఎయిర్ పాడ్ మోడల్స్ కొత్త ఫీచర్లతో వస్తున్నాయి. ఆపిల్ ఐ-ఫోన్ 16 ప్రో మోడల్ ఫోన్లు స్వల్పంగా పెద్ద డిస్ ప్లేతో వస్తున్నాయి.
ఆపిల్ ఈ దఫా ఐ-ఫోన్ 16లో నాలుగు మోడల్స్ ఆవిష్కరించనున్నది. అందులో ఐ-ఫోన్ 16, ఐ-ఫోన్ 16 ప్లస్, ఐ-ఫోన్ 16 ప్రో, ఐ-ఫోన్ 16 ప్రో మ్యాక్స్ ఫోన్లు ఉన్నాయి. సెప్టెంబర్ 20 నుంచి దేశీయ మార్కెట్లో ఆపిల్ ఐ-ఫోన్ 16 సిరీస్ ఫోన్ల విక్రయాలు ప్రారంభం అవుతాయని భావిస్తున్నారు.దీంతోపాటు ఐ-ఫోన్ 16 మోడల్ ఫోన్ల విక్రయంతోపాటు ఐ-ఫోన్ 15 సిరీస్ ఫోన్లలో ఆపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లు ఈ ఏడాది చివర్లో జత చేయనున్నది.