న్యూఢిల్లీ, సెప్టెంబర్ 28: ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్‌లో ఐడీఎఫ్సీ విలీనానికి ఇరు సంస్థల బోర్డులు ఆమోదం తెలిపాయి. ఈ విలీనం అక్టోబర్ 1 నుంచి అమలులోకి రానున్నది.
ఈ విలీనానికి నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్, చెన్నై బెంచ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఐడీఎఫ్సీ లిమిటెడ్ వాటాదారులకు రూ.10 ముఖ విలువ కలిగిన 100 ఈక్విటీ షేర్లకుగాను ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్‌నకు చెందిన 155 ఈక్విటీ షేర్లు లభించనున్నాయి.