Interest on FD | పెరిగిపోతున్న ధరలకు కళ్లెం వేసేందుకు ఆర్బీఐ రెపోరేట్ పెంచిన తర్వాత పలు బ్యాంకులు తమ కీలక వడ్డీరేట్ల పెంపుదలపై దృష్టి కేంద్రీకరించాయి. ఇండ్ల రుణాలతోపాటు వివిధ రుణాల వడ్డీరేట్లు, అలాగే ఫిక్స్డ్ డిపాజిట్ పథకాలపైనా వడ్డీరేట్లు పెంచేస్తున్నాయి. ఆ బాటలో ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్, కొటక్ మహీంద్రా బ్యాంక్ కూడా పయనిస్తున్నాయి. మరోవైపు కెనరాబ్యాంక్ తన ఖాతాదారుల సేవింగ్స్ ఖాతాల్లో డిపాజిట్లపై వడ్డీరేట్లు ఐదు బేసిక్ పాయింట్లు పెంచేసింది. ఆయా టెన్యూర్ల ప్రకారం ఫిక్స్డ్, సేవింగ్స్ ఖాతాలపై వడ్డీరేట్ల వివరాలు చూద్దామా.. !
గడువు —————————- వడ్డీరేటు (శాతం)
7 – 29 రోజులు ——————– 3.50
30 – 90 రోజులు —————— 4.00
91 – 180 రోజులు —————– 4.50
181 రోజుల నుంచి ఏడాది —— 5.75
మూడేండ్ల లోపు —————– 6.25
ఐదేండ్ల లోపు ——————- 6.50
పదేండ్ల లోపు ——————– 6.00
గడువు ——————————– వడ్డీరేటు
7 – 30 రోజులు ———————— 2.50
31 – 90 రోజులు ———————- 3.00
91- 179 రోజులు ———————- 3.50
180 – 363 రోజులు ——————- 4.75
364 రోజులు ————————– 5.25
365 – 389 రోజులు ——————- 5.50
390 రోజుల నుంచి మూడేండ్లు—– 5.75
పదేండ్ల లోపు ———————— 5.90
సేవింగ్స్ అకౌంట్స్‌లో డిపాజిట్లపై ఐదు బేసిక్ పాయింట్లు వడ్డీరేటు పెంచుతూ కెనరాబ్యాంకు నిర్ణయం తీసుకున్నది. ఇప్పటి వరకు తన కస్టమర్లకు 3.55 శాతం వడ్డీ రేటు ఆఫర్ చేసింది. పెంచిన వడ్డీరేట్లు గత నెల 29 నుంచి అమల్లోకి వచ్చాయి. ఆ వివరాలు ఇలా
డిపాజిట్ల మొత్తం ——————————- వడ్డీరేటు
రూ. 50 లక్షల వరకు ————————— 2.90%
రూ.50 లక్షల నుంచి రూ.100 కోట్ల వరకు —- 2.90%
రూ.100 కోట్ల నుంచి రూ.500 కోట్ల వరకు —– 3.10%
రూ.1000 కోట్ల వరకు ————————— 3.50%
రూ.1000 కోట్ల పై చిలుకు ———————- 3.55%