హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 18 (నమస్తే తెలంగాణ): అభివృద్ధి చెందుతున్న అత్యాధునిక టెక్నాలజీలను వ్యవసాయ రంగంలోనూ విరివిగా వినియోగించేలా ఎమర్జింగ్ టెక్నాలజీ వింగ్ ఆధ్వర్యంలో కొత్తగా ఐసీటీ ఫర్ అగ్రి కల్చర్ ఇండియా చాప్టర్‌ను ఏర్పాటు చేస్తున్నామని ఎమర్జింగ్ టెక్నాలజీ వింగ్ ఓఎస్డీ రమాదేవి తెలిపారు.
మంగళవారం టీ హబ్‌లో జరిగే కార్యక్రమంలో రాష్ట్ర ఐటీ శాఖ కార్యదర్శి జయేశ్ రంజన్ ఈ చాప్టర్‌ను ప్రారంభిస్తున్నారని తెలిపారు. భారతదేశంలో అగ్రి-ఫుడ్ సిస్టమ్స్ కోసం సమగ్రమైన, బాధ్యతాయుతమైన డిజిటల్ ఆవిష్కరణల దిశగా వర్క్‌షాపులను నిర్వహిస్తున్నామని, ప్రారంభ కార్యక్రమంలో పలువురు నిపుణులు ప్రసంగిస్తారని ఆమె తెలిపారు.