న్యూఢిల్లీ : ఐసీఐసీఐ లాంబార్డ్ నికరలాభం మార్చితో ముగిసిన త్రైమాసికంలో 40 శాతం వృద్ధిచెంది రూ. 437 కోట్లకు చేరింది. ప్రీమియం ఆదాయం 6.7 శాతం వృద్ధితో రూ.4,977 కోట్లకు పెరిగినట్టు మంగళవారం కంపెనీ తెలిపింది. పూర్తి ఆర్థిక సంవత్సరంలో లాభం 36 శాతం పెరుగుదలతో రూ. 1,729 కోట్లకు చేరగా, ప్రీమియం ఆదాయం రూ. 21,025 కోట్ల వద్ద నిలిచింది.