న్యూఢిల్లీ, సెప్టెంబర్ 17: దివాలా ప్రక్రియలో ఇన్సాల్వెన్సీ ప్రొఫెనల్స్ వీలైనంత పారదర్శకంగా వ్యవహరించాల్సిన అవసరం ఉన్నదని ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్ప్స్రీ బోర్డ్ ఆఫ్ ఇండియా (ఐబీబీఐ) చైర్మన్ రవీ మిట్టల్ అభిప్రాయపడ్డారు. అప్పుడే మొండి బకాయిల పరిష్కార బిడ్డింగ్‌లో ఎక్కువమంది పాల్గొంటారని, దాంతో రుణాలిచ్చినవారికి మరింత సొమ్మును ఇప్పించగలమని చెప్పారు.
మంగళవారం ఇక్కడ ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇన్సాల్వెన్సీ ప్రొఫెషనల్స్ ఆఫ్ ఐసీఏఐ నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడుతూ.. ఇన్సాల్వెన్సీ వ్యవస్థకు ఇన్సాల్వెన్సీ ప్రొఫెషనల్స్, ఇన్సాల్వెన్సీ ప్రొఫెషనల్ సంస్థలే ఆధారం అన్నారు. దివాలా ప్రక్రియను వేగవంతం చేయాలని కూడా ఇన్సాల్వెన్సీ ప్రొఫెషనల్స్‌కు సూచించారు. సమయాన్ని దృష్టిలో పెట్టుకొని జాప్యం లేకుండా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. దాంతో ఐబీబీఐపై విశ్వాసం పెరుగుతుందన్నారు.