Hyundai New Verna | దక్షిణ కొరియా కార్ల తయారీ సంస్థ హ్యుండాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్.. మంగళవారం మిడ్‌సైజ్ సెడాన్ కారు వెర్నాను దేశీయ మార్కెట్లో ఆవిష్కరించనున్నది. ఇది సిక్స్త్ జనరేషన్ మిడ్ సైజ్ సెడాన్ కారు కానున్నది. ఇది హోండా సిటీ – 2023, స్కోడా స్లావియా, ఫోక్స్ వ్యాగన్ విర్టస్, మారుతి సుజుకి సియాజ్ వంటి మోడల్ కార్లతో పోటీ పడనున్నది. పూర్తిగా న్యూ లుక్‌తో కస్టమర్లకు అందుబాటులోకి వస్తున్నది. దీని ధర రూ.9.99-17 లక్షల మధ్య పలుకుతుందని భావిస్తున్నారు. 14 వేరియంట్లలో వినియోగదారులకు అందుబాటులోకి వస్తున్నది. ఆసక్తి గల కొనుగోలుదారులు రూ.25,000 వేలు చెల్లించి కారు బుక్ చేసుకోవచ్చు.
హ్యుండాయ్ వెర్నా రెండు ఇంజిన్ ఆప్షన్లలో లభిస్తుంది. 1.5- లీటర్ల ఎంపీఐ సామర్థ్యం గల పెట్రోల్ ఇంజిన్, 1.5-లీటర్ల టర్బో జీడీఐ సామర్థ్యం గల పెట్రోల్ ఇంజిన్‌తో వస్తున్నది. 1.5- లీటర్ల ఎంపీఐ సామర్థ్యం గల పెట్రోల్ ఇంజిన్ గరిష్టంగా 115 పీఎస్ పవర్, 143.8 ఎన్ఎం టార్చి, 1.5- లీటర్ల టర్బో జీడీఐ సామర్థ్యం గల పెట్రోల్ ఇంజిన్ 160 పీఎస్ విద్యుత్, 253 ఎన్ఎం టార్చి వెలువరిస్తుంది. ఎంపీఐ పెట్రోల్ ఇంజిన్ వేరియంట్ కారు 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్, ఐవీటీ ఆటోమేటిక్, టర్బో జీడీఐ పెట్రోల్ ఇంజిన్ కారు 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్, 7- స్పీడ్ డీసీటీ ఆప్షన్‌తో వస్తుంది.
న్యూ వెర్నా కారులో 30 స్టాండర్డ్ సేఫ్టీ ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. హ్యుండాయ్ స్మార్ట్ సెన్స్ విత్ 17 లెవెల్ 2 అడాస్ ఫీచర్స్, 65కి పైగా అడ్వాన్స్డ్ సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి. ఫార్వార్డ్ కొల్లిషన్ వార్నింగ్, ఫార్వర్డ్ కొల్లిషన్ అవాయిడెన్స్ అసిస్ట్, బ్లైండ్ స్పాట్ కొల్లిషన్, లాన్ కీపింగ్ అసిస్ట్, లాన్ డిపార్చర్ వార్నింగ్, డ్రైవర్ అటెన్షన్ వార్నింగ్, సేఫ్ ఎగ్జిట్ వార్నింగ్ తదితర సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి.
సింగిల్ పాన్ సన్‌రూఫ్, స్టయిలిష్ అల్లాయ్ వీల్స్, ఎల్ఈడీ ట్రిపుల్ బ్యారెల్ రిఫ్లెక్టర్ హెడ్‌ల్యాప్ సెటప్, ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్లు, లార్జ్ ఎల్ఈడీ లైట్ బార్, క్రోమ్ డిటైలింగ్ అండ్ ఓఆర్వీఎం మౌంటెడ్ కెమెరాలు, డ్యుయల్ స్క్రీన్ సెటప్తోపాటు 10.25 అంగుళాల ఫుల్లీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, 10.25- అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్ (అడాస్), ఆటోనమస్ ఎమర్జెన్సీ బ్రేకింగ్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, ఏబీఎస్ విత్ ఈబీఈ, సిక్స్ ఎయిర్‌బ్యాగ్స్, టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్ తదితర ఫీచర్లు జత కలిశాయి.