Hyundai Venue Executive Turbo | దక్షిణ కొరియా ఆటో మేజర్ హ్యుండాయ్ మోటార్ ఇండియా తన వెన్యూ న్యూ వేరియంట్ ‘ఎగ్జిక్యూటివ్ టర్బో’ భారత్ మార్కెట్లో ఆవిష్కరించింది. దీని ధర రూ.9.99 లక్షలు (ఎక్స్ షోరూమ్)గా నిర్ణయించారు. ఈ కారు మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఆప్షన్లో మాత్రమే లభిస్తుంది. దీంతోపాటు అప్ డేటెడ్ హ్యుండాయ్ వెన్యూ ఎస్ (ఓ) టర్బో మోడల్ కారులో మరిన్ని సౌకర్యవంతమైన ఫీచర్లు ఉన్నాయి. ఈ కారు మాన్యువల్ ట్రాన్స్మిషన్ ధర రూ.10.75 లక్షలు (ఎక్స్ షోరూమ్), 7-స్పీడ్ డీసీటీ వేరియంట్ రూ.11.86 లక్షలు (ఎక్స్ షోరూమ్) పలుకుతుంది.
హ్యుండాయ్ వెన్యూ ఎగ్జిక్యూటివ్ టర్బో ట్రిమ్ 16-అంగుళాల డ్యుయల్ టోన్ స్టైలేజ్డ్ వీల్స్, గ్రిల్లెపై డార్క్ క్రోమ్, రూఫ్ రెయిల్స్, షార్క్ ఫిన్ ఆంటేనా, టెయిల్ గేట్‌పై ఎగ్జిక్యూటివ్ ఎంబ్లమ్, ఇంటీరియర్‌గా ఫ్రంట్ సెంటర్ ఆర్మ్ రెస్ట్ విత్ స్టోరేజీ, 2-స్టెప్ రేర్ రీసైక్లింగ్ సీట్లు, 60:40 స్ప్లిట్ సీట్లు, ప్రయాణికులందరికీ అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్స్ ఉంటాయి.
వైర్ లెస్ ఆండ్రాయిడ్ ఆటో అండ్ ఆపిల్ కార్ ప్లేతోపాటు 8- అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, వాయిస్ రికగ్నిషన్, డ్రైవర్ కోసం టీఎఫ్టీతోపాటు డిజిటల్ క్లస్టర్ ఫీచర్లు ఉంటాయి. సేఫ్టీ కోసం 6-ఎయిర్ బ్యాగ్స్, సీట్ బెల్ట్ రిమైండర్లతోపాటు 3-పాయింట్ సీట్ బెల్టులు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, వెహికల్ స్టెబిలిటీ మేనేజ్మెంట్, హిల్ అసిస్ట్ కంట్రోల్, ఆటోమేటిక్ హెడ్ ల్యాంప్స్, టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్ తదితర ఫీచర్లు ఉంటాయి.
హ్యుండాయ్ వెన్యూ ఎగ్జిక్యూటివ్ టర్బో వేరియంట్ 1.0-లీటర్ల త్రీ సిలిండర్ టర్బో చార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్ కలిగి ఉంటుంది. ఈ ఇంజిన్ 6000 ఆర్పీఎం వద్ద గరిష్టంగా 118 బీహెచ్పీ విద్యుత్, 1500-4000 ఆర్పీఎం వద్ద 172 ఎన్ఎం టార్క్ వెలువరిస్తుంది. ఎగ్జిక్యూటివ్ టర్బో వేరియంట్ 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఆప్షన్‌తో వస్తుంది. ఫ్యుయల్ ఎఫిషియెన్సీ పెంచేందుకు ఐడిల్ స్టార్ట్ లేదా స్టాప్ సిస్టమ్ ఉంటుంది. హ్యుండాయ్ అప్ డేటెడ్ వెన్యూ ఎస్ (ఓ) టర్బో వేరియంట్ కారు ఎలక్ట్రిక్ సన్ రూఫ్, ప్యాసింజర్ లేదా డ్రైవర్ కోసం మ్యాప్ ల్యాంప్స్, 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్, 7-స్పీడ్ డ్యుయల్ క్లచ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఆప్షన్లతో వస్తుంది.