Creta N Line | దక్షిణ కొరియా ఆటో మేజర్ హ్యుండాయ్ మోటార్ ఇండియా.. తన క్రెటా ఫేస్ లిఫ్ట్ వర్షన్ కారు క్రెటా ఎన్ లైన్ భారత్ మార్కెట్లో వచ్చే ఏడాది (2024) తొలి త్రైమాసికంలో ఆవిష్కరించనున్నది. మిడ్ సైజ్ ఎస్యూవీ క్రెటా ఎన్ లైన్ కారు కస్టమర్లకు అందుబాటులోకి రానున్నది. ఇప్పటి వరకు ఎన్ లైన్ వేరియంట్లలో భారత్ లోకి రానున్న మూడో మోడల్ ఎన్ లైన్ మిడ్ సైజ్ ఎస్ యూవీ ‘క్రెటా` ఎన్ లైన్ నిలుస్తుంది. ఇప్పటి వరకు భారత్ మార్కెట్లో వెన్యూ ఎన్ లైన్, ఐ20 ఎన్ లైన్ మోడల్ కార్లు అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం దక్షిణ అమెరికా మార్కెట్లో క్రెటా ఎన్ లైన్ లభిస్తున్నది.
ప్రస్తుతం హ్యుండాయ్ క్రెటా టు పవర్ ట్రైన్స్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. 113 బీహెచ్పీ- 1.5 లీటర్ల నాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్, 1.5 లీటర్ల డీజిల్ విత్ 114 బీహెచ్పీ వేరియంట్లు మార్కెట్లు ఉన్నాయి. పెట్రోల్ వేరియంట్ 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్ మిషన్ అండ్ సీవీటీ ఆప్షన్, డీజిల్ వేరియంట్ 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్, 6-స్పీడ్ టార్చర్ కన్వర్టర్ ఆటోమేటిక్ ఆప్షన్లలో లభిస్తుంది. రెండో దశ బీఎస్-6 ప్రమాణాల అమల్లో భాగంగా హ్యుండాయ్.. 1.4 లీటర్ల టర్బో ఇంజిన్ వేరియంట్ ఉపసంహరించింది.
క్రెటా ఎన్-లైన్ కారు 1.5 లీటర్ల టర్బో పెట్రోల్ పవర్ ట్రైన్, 157.5 బీహెచ్పీ విద్యుత్, 253 ఎన్ఎం టార్చ్ వెలువరిస్తుంది. అల్కాజర్, న్యూ వెర్నా మోడల్ కార్లలోనూ ఈ ఆప్షన్ ఉంది. క్రెటా ఎన్-లైన్ కారు 6-స్పీడ్ మాన్యువల్, 7-స్పీడ్ డ్యుయల్ క్లచ్ ఆటోమేటిక్ గేర్ బాక్స్ ఆప్షన్ లో వస్తుందని తెలుస్తున్నది.
ప్రస్తుతం బ్రెజిల్ లో అందుబాటులో ఉన్న క్రెటా ఎన్ లైన్ వేరియంట్ ప్రకారం ఇండియన్ వర్షన్ కారు అడాస్ (అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్) విత్ అటానమస్ బ్రేకింగ్ సిస్టమ్, లేన్ డిపార్చర్ వార్నింగ్ సిస్టమ్, లేన్ కీప్ అసిస్ట్ తదితర ఫీచర్లు ఉంటాయి.
7-అంగుళాల ఇన్ స్ట్రుమెంట్ క్లస్టర్, డ్రైవర్ ఫాటిగూ డిటెక్టర్, 10.25 అంగుళాల ఇన్ఫోటైన్ మెంట్ సిస్టమ్, సేఫ్టీ కోసం సిక్స్ ఎయిర్ బ్యాగ్స్, ఫ్రంట్ అండ్ రేర్ పార్కింగ్ సెన్సర్లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, ట్రాక్షన్ కంట్రోల్, టైర్ ప్రెషర్ మానిటర్ సిస్టమ్, కనెక్టెడ్ కారు టెక్నాలజీ తదితర ఫీచర్లు ఉండొచ్చునని తెలుస్తున్నది.