న్యూఢిల్లీ, ఏప్రిల్ 8 : హ్యుందాయ్ మోటర్ ఇండియా కూడా వాహన ధరలను ఒక్క శాతం వరకు పెంచుతున్నట్టు ప్రకటించింది. ఈ ధరలు వచ్చే నెల నుంచి అమల్లొకి రానున్నట్టు పేర్కొంది ఉత్పత్తి వ్యయాలు అధికం కావడంతో వాహన ధరలను పెంచాల్సి వచ్చిందని, దీంతో ఆయా మాడళ్లు మరింత ప్రియంకాబోతున్నాయి.
వినియోగదారులపై భారం మోపాలనే ఉద్దేశం సంస్థకు లేనప్పటికీ, ప్రస్తుతం అంతర్జాతీయంగా నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా తప్పడం లేదని కంపెనీ వర్గాలు వెల్లడించాయి.