Hyundai – Amaron | ప్రముఖ కార్ల తయారీ సంస్థ హ్యుండాయ్ మోటార్ ఇండియా (Hyundai Motor India) దేశీయంగా కార్ల తయారీలో అమెరాన్ బ్యాటరీ టెక్నాలజీని ఉపయోగించుకోనున్నది. అమెరాన్ మేడిన్ ఇండియా (ఏజీఎం) అబ్జార్బెంట్ గ్లాస్ మ్యాట్) బ్యాటరీని ఎస్ఎల్ఐ (స్టార్టింగ్, లైటింగ్, ఇగ్నిషన్) బ్యాటరీగా వినియోగించనున్నది హ్యుండాయ్. ఇందుకోసం అమెరాన్ నుంచి ఏజీఎం బ్యాటరీలను హ్యుండాయ్ కొనుగోలు చేసేందుకు రెండు సంస్థల మధ్య ఒప్పందం కుదిరింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో దేశీయ టెక్నాలజీతో రూపొందించిన బ్యాటరీలను తయారు చేయాలని అమెరాన్ భావిస్తున్నది. దేశీయ కస్టమర్ల కోసం దేశీయంగా అందుబాటులో ఉన్న సృజనాత్మక టెక్నాలజీని వినియోగించడంలో భాగంగా అమెరాన్ తో హ్యుండాయ్ జత కట్టింది.