Hyundai |దక్షిణ కొరియా ఆటో మేజర్ హ్యుండాయ్ మోటార్ ఇండియా.. తమ కస్టమర్ల సేఫ్టీకి అధిక ప్రాధాన్యం ఇస్తున్నది. అన్ని మోడల్ కార్లలో స్టాండర్డ్ సీట్లన్నింటికీ 3-పాయింట్ సీట్ బెల్ట్స్, సీడ్ బెల్ట్ రిమైండర్లు తప్పనిసరి చేస్తున్నది. గ్రాండ్ ఐ10 నియోస్ (Grand i10 Nios) నుంచి ఐకానిక్ 5 (Ioniq 5) వరకు 12 మోడల్ కార్లు భారత్‌లో విక్రయిస్తున్నది.
`మా కస్టమర్ల సేఫ్టీ మాకు అత్యంత ప్రాధాన్యం. అందుకు అనుగుణంగా మా కార్లలో సేఫ్టీ ఫీచర్లు స్టాండర్డైజ్ చేశాం. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలను అనుగుణంగా మా కార్లలో నిరంతరం సేఫ్టీ ప్రమాణాలను నిరంతరం బలోపేతం చేయడానికి కట్టుబడి ఉన్నాం. అన్ని మోడల్ కార్లలోనూ 3-పాయింట్ సీట్ బెల్ట్, సీట్ బెల్ట్ రిమైండర్లు ప్రామాణికంగా అప్డేట్ చేస్తాం` అని హ్యుండాయ్ మోటార్ ఇండియా చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ తరుణ్ గార్గ్ చెప్పారు.
ఈ ఏడాది ప్రారంభం నుంచి హ్యుండాయ్ తన బ్రాండ్ కార్లలో ముఖ్యమైన నిర్ణయాలు అమలు చేసింది. హ్యుండాయ్ టస్కన్, హ్యుండాయ్ కోనా మోడల్ కార్లలో సిక్స్ ఎయిర్‌బ్యాగ్‌లను ప్రామాణికంగా ఏర్పాటు చేస్తూ వచ్చింది. తదుపరి దశలో క్రెటా, అల్కాజర్, ఐయానిక్5 మోడల్ కార్లకు సిక్స్ ఎయిర్‌బ్యాగ్‌ల ఏర్పాటు ప్రామాణికంగా అమలు చేస్తున్నది. ఫోర్ ఎయిర్‌బ్యాగ్‌లు వాడుతున్న వెన్యూలో సిక్స్ ఎయిర్ బ్యాగ్‌లు ఆప్షనల్ చేసింది. గ్రాండ్ ఐ10 నియోస్, ఔరా మోడల్ కార్లలో నాలుగు ఎయిర్‌బ్యాగ్‌లు తప్పనిసరి. ఇటీవల మార్కెట్లో ఆవిష్కరించిన వెర్నా మోడల్ కారులోనూ సిక్స్ ఎయిర్‌బ్యాగ్‌లు ప్రామాణికంగా ఏర్పాటు చేస్తున్నది.
టస్కన్, ఐకానిక్5, వెర్నా మోడల్ కార్లలో స్మార్ట్ సెన్స్ లెవెల్-2 అడాస్ ఫీచర్లు వాడుతున్నది. ఇతర మోడల్ కార్లలోనూ అడాస్ ఫీచర్లు వాడటానికి ప్రాధాన్యం ఇస్తున్నది. క్రెటా, అల్కాజర్ వంటి ఎస్యూవీ కార్లకు హ్యుండాయ్ మోటార్ పాపులర్.