Hyundai | దక్షిణ కొరియా ఆటోమొబైల్ దిగ్గజం హ్యుండాయ్ ఇండియా కొన్ని సెలెక్టెడ్ కార్లపై రూ. లక్ష వరకు డిస్కౌంట్లు ఆఫర్ చేస్తున్నది. ప్రస్తుత తరుణంలో కార్లు కొనాలని భావించే వారికి సువర్ణావకాశం అని చెబుతున్నారు. ఈ నెలాఖరు వరకు హ్యుండాయ్ కార్ల కొనుగోళ్లపై ఆఫర్లు అమల్లో ఉన్నాయి. క్యాష్ డిస్కౌంట్, ఎక్స్చేంజ్ ఆఫర్, కార్పొరేట్ డిస్కౌంట్లు అందిస్తోంది. హ్యుండాయ్ ఏయే కార్లపై ఆఫర్లు ఇస్తుందో లుక్కేద్దామా..!
భారత్ ఆటోమొబైల్ మార్కెట్లోకి హ్యుండాయ్ తీసుకొచ్చిన తొలి ఎలక్ట్రిక్ కారు కొనా ఎలక్ట్రిక్. 2019లో కొనా ఎలక్ట్రిక్‌ను హ్యుండాయ్ఆవిష్కరించింది. ప్రస్తుతం ఆఫర్ల కింద రూ.లక్ష వరకు డిస్కౌంట్ ఇస్తున్నది. ఒక్కసారి ఫుల్ చార్జింగ్ చేస్తే 452 కిలోమీటర్ల వరకు ప్రయాణించొచ్చు.
గ్రాండ్ ఐ10 నియోస్ కారు కొనుగోలు దారులకు పలు ఆప్షన్లలో రాయితీలు కల్పిస్తున్నది. 1.0 లీటర్ల టర్బో వేరియంట్‌పై రూ.35 వేలు, సీఎన్జీ వేరియంట్ కారుపై రూ.25 వేలు, 1.2 లీటర్ల పెట్రోల్ వేరియంట్‌పై రూ.15 వేలు డిస్కౌంట్ అందిస్తున్నది. ఎక్స్చేంజ్ బోనస్ రూపంలో రూ.10 వేలు, కార్పొరేట్ డిస్కౌంట్ రూ.3,000 వరకు లభిస్తుంది. గరిష్టంగా రూ.48 వేల వరకు డిస్కౌంట్లు పొందొచ్చు.
ఔరా పెట్రోల్, సీఎన్జీ మోడల్ కార్లపై రూ.5,000, రూ.25 వేల క్యాష్ డిస్కౌంట్ అందిస్తున్నది. ఎక్స్చేంజ్ బోనస్ రూపంలో రూ.10 వేలు, కార్పొరేట్ డిస్కౌంట్ రూ. 3000 పొందొచ్చు.
ఐ20 మోడల్ కారు మీద రూ.10వేల క్యాష్ డిస్కౌంట్, ఎక్స్చేంజ్ బోనస్ అంద చేస్తున్నది. మాగ్నా, స్పోర్ట్జ్ మోడల్ కార్లకు కూడా ఇదే ఆఫర్లు వర్తిస్తాయి. ఇక నుంచి లగ్జరీ కార్లు, ఎస్‌యూవీలు, ఎలక్ట్రిక్ కార్లపైనే దృష్టి పెట్టనున్నట్లు ప్రకటించింది.