న్యూఢిల్లీ, మార్చి 7:ప్రముఖ వాహన సంస్థ హ్యుందాయ్ మోటర్..దేశీయ మార్కెట్‌కు సరికొత్త అల్కాజర్ నూతన మాడల్‌ను పరిచయం చేసింది. 1.5 టర్బో జీడీఐ పెట్రోల్ ఇంజిన్ కలిగిన ఈ మాడల్ రూ.16.74 లక్షల నుంచి రూ.20.25 లక్షల లోపు ధరను నిర్ణయించింది. ఈ ధరలు ఢిల్లీ షోరూంనకు సంబంధించినవి. ఆరు స్పీడ్ మాన్యువల్, ఏడు-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ కలిగిన ఈ మాడల్ 1.5 లీటర్ల డీజిల్ ఇంజిన్‌లో లభించనున్నది.