Hyundai Discounts | దక్షిణ కొరియా కార్ల తయారీ సంస్థ హ్యుండాయ్ మోటార్ ఇండియా.. కస్టమర్లను ఆకర్షించేందుకు.. ఇతర సంస్థలతో పోటీ పడేందుకు సిద్ధమవుతున్నది. ఐదు మోడల్ కార్లపై బెనిఫిట్లు కల్పిస్తున్నట్లు ప్రకటించింది గరిష్టంగా రూ.50 వేల వరకు ఈ బెనిఫిట్లు లభిస్తాయి. ఐ20 (i20), గ్రాండ్ ఐ-10 నియోస్ (Grand i10 Nios), ఔరా (Aura), అల్కాజర్ (Alcazar), కోనా ఎలక్ట్రిక్ (Kona Electric) కార్ల కొనుగోలుదారులకు ఈ బెనిఫిట్లు లభిస్తాయి. ఈ నెలాఖరు వరకు మాత్రమే ఈ ఆఫర్లు వర్తిస్తాయి.
దేశీయ మార్కెట్లో ఏప్రిల్‌లో 49,701 కార్లు, గత నెలలో 48,601 యూనిట్లు విక్రయించింది హ్యుండాయ్ మోటార్ ఇండియా. అయితే పాపులర్ క్రెటా, వెన్యూ, టస్కన్ వంటి ఎస్యూవీ కార్లతోపాటు ఇటీవల మార్కెట్లో ఆవిష్కరించిన వెర్నా సెడాన్ కార్లపై మాత్రం ఈ నెలలో ఎటువంటి ఆఫర్లు ప్రకటించలేదు.
మీరు హ్యుండాయ్ ఐ20 హ్యాచ్‌బ్యాక్ కారు కొనాలనుకుంటున్నారా.. అయితే రూ.20 వేల వరకు బెనిఫిట్లు పొందవచ్చు. ఐ20 మాగ్నా, స్పోర్ట్జ్ మోడల్ కార్లపై రూ.10 వేలు క్యాష్ బ్యాక్, రూ.10 వేలు ఎక్స్చేంజ్ బోనస్ ఇస్తున్నది. దీని ధర రూ.7.46 లక్షల నుంచి రూ.11.88 లక్షల మధ్య ధర పలుకుతుంది. మారుతి సుజుకి బాలెనో, టాటా ఆల్ట్రోజ్ వంటి కార్లతో హ్యుండాయ్ ఐ20 పోటీ పడుతుంది.
గ్రాండ్ ఐ10 నియోస్ మోడల్ కారుపై హ్యుండాయ్ రూ.38 వేల వరకు రాయితీలు అందిస్తున్నది. ఇందులో ఎగ్జిక్యూటివ్ మినహా పెట్రోల్ ఎంటీపై రూ.20 వేలు/ స్పోర్ట్జ్ ఎగ్జిక్యూటివ్ కారుపై రూ.25 వేలు క్యాష్ బ్యాక్, రూ.10 వేలు ఎక్స్చేంజ్ బెనిఫిట్, రూ.3000 కార్పొరేట్ బెనిఫిట్ లభిస్తుంది. దీని ధర రూ.5.73 లక్షల నుంచి రూ.8.51 లక్షల మధ్య పలుకుతుంది. మారుతి సుజుకి పాపులర్ కారు స్విఫ్ట్‌పై హ్యుండాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ పోటీ పడుతుంది.
మారుతి సుజుకి డిజైర్, హోండా అమేజ్, టాటా టైగోర్ మోడల్ కార్లతో హ్యుండాయ్ ఔరా తల పడుతుంది. దీనిపై రూ.33 వేల వరకు వివిధ డిస్కౌంట్లు అందిస్తున్నది. పెట్రోల్ ఎంటీ అండ్ ఏఎంటీ మీద రూ.10 వేలు, సీఎన్జీ వేరియంట్ మీద రూ.20 వేల క్యాష్ బ్యాక్, రూ.10 వేలు ఎక్స్చేంజ్ బోనస్, రూ.3000 కార్పొరేట్ బెనిఫిట్ లభిస్తుంది. దీని ధర రూ.6.32 లక్షల నుంచి రూ.8.90 లక్షల మధ్య పలుకుతుంది.
టాటా సఫారీ, మహీంద్రా ఎక్స్‌యూవీ 700 మోడల్ కార్లతో హ్యుండాయ్ మోటార్ అల్కాజర్ తల పడుతుంది. దీని ధర రూ.16.77 లక్షల నుంచి రూ.21.13 లక్షల మధ్య పలుకుతుంది. అల్కాజర్ మోడల్ కారుపై ఎక్స్చేంజ్ బోనస్ రూపంలో రూ.20 వేల రాయితీ అందిస్తున్నది.
హ్యుండాయ్ మోటార్ తొలి ఎలక్ట్రిక్ కారు కోనా ఈవీ కొనుగోలు చేసే వారికి రూ.50 వేల వరకు బెనిఫిట్లు లభిస్తాయి. ఎంజీ జడ్ఎస్ ఈవీ కారు ధర రూ.23.84 లక్షలు పలుకుతున్నది.
మోడల్ —————– బెనిఫిట్లు
హ్యుండాయ్ ఐ20 —– రూ.20 వేలు
గ్రాండ్ ఐ10 నియోస్ — రూ.38 వేలు
ఔరా ——————– రూ.33 వేలు
అల్కాజర్ ————- రూ.20 వేలు
కోనా ఎలక్ట్రిక్ ———- రూ.50 వేలు