న్యూఢిల్లీ : హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ కార్పొరేట్ ఎడిషన్ సేల్ షురూ అయింది. ఫీచర్లు, ధర ఆధారంగా లేటెస్ట్ వెహికల్ గ్రాండ్ ఐ10 నియోస్ మ్యాగ్నా, స్పోర్ట్స్ ట్రిమ్స్కు మధ్యస్ధంగా ఉంటుంది. హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ కార్పొరేట్ రూ 6.2 లక్షల నుంచి అందుబాటులో ఉంది. గ్రాండ్ ఐ10 నియోస్ కార్పొరేట్ ఎడిషన్ గన్ మెటల్ ఫినిష్ వీల్స్, రూఫ్ రెయిల్స్, రియర్ క్రోం గార్నిష్, గ్లాస్ బ్లాక్ రేడియేటర్ గ్రిల్ వంటి ఫీచర్లతో ఆకట్టుకుంటుంది.
6.75 ఇంచ్ టచ్స్క్రీన్ ఫోన్ మిర్రరింగ్తో నావిగేషన్ అందుబాటులో ఉంది. నూతన తరం యువతను దృష్టిలో ఉంచుకుని గ్రాండ్ ఐ10 నియోస్ కార్పొరేట్ ఎడిషన్ను లాంఛ్ చేశామని హ్యుందాయ్ మోటార్ ఇండియా డైరెక్టర్ (సేల్స్, మార్కెటింగ్) తరుణ్ గార్గ్ పేర్కొన్నారు. స్పోర్టీ ఫీచర్లు కోరుకునే వారిని కార్పొరేట్ ఎడిషన్ ఆకట్టుకుంటుందని చెప్పారు.