Hyundai Cars Discounts | మీరు కొత్త కారు కొనుక్కోవాలని భావిస్తున్నారా.. అయితే దక్షిణ కొరియా ఆటోమేజర్ హ్యుండాయ్ ఈ నెలాఖరు వరకు పలు మోడల్ కార్లపై ఆకర్షణీయ ఆఫర్లు అందిస్తున్నది. హ్యుండాయ్ గ్రాండ్ ఐ10 నియోస్, ఔరా, ఐ20, అల్కాజర్, కోనా ఈవీ మోడల్ కార్లపై అద్భుతమైన క్యాష్ డిస్కౌంట్లు, ఎక్స్చేంజ్ బోనస్, కార్పొరేట్ డిస్కౌంట్ తదితర ఆఫర్లు ఉన్నాయి. ఆ ఆఫర్లేమిటో ఓ లుక్కేద్దామా..!
ఆల్-న్యూ గ్రాండ్ ఐ10 నియోస్ కారుపై మొత్తం రూ.38 వేల వరకు క్యాష్ డిస్కౌంట్ అందుబాటులో ఉంది. స్పోర్ట్స్ ఎగ్జిక్యూటివ్ మోడల్ కారుపై గరిష్ట, ఏఎంటీ మోడల్ మీద తక్కువ డిస్కౌంట్లు లభిస్తాయి. డైరెక్ట్ క్యాష్ డిస్కౌంట్, ఎక్స్చేంజ్ బోనస్, కార్పొరేట్ బోనస్ రూపాల్లో లభిస్తుంది.
స్పోర్ట్జ్ ఎగ్జిక్యూటివ్ మినహా పెట్రోల్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ కార్లపై క్యాష్ డిస్కౌంట్ రూ.20 వేలు, స్పోర్ట్జ్ ఎగ్జిక్యూటివ్ మోడల్ కారుపై రూ.25 వేలు క్యాష్ డిస్కౌంట్ లభిస్తుండగా, ఏఎంటీ వేరియంట్ మీద ఎటువంటి డిస్కౌంట్ అందుబాటులో లేదు. ఎక్స్చేంజ్ బోనస్ రూపంలో రూ.10 వేలు, కార్పొరేట్ డిస్కౌంట్ రూపేణా రూ.3,000 లభిస్తుంది.
ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న ‘ఔరా ఫేస్ లిఫ్ట్` మోడల్ కారుపై మొత్తం డిస్కౌంట్లు గరిష్టంగా రూ.33 వేల వరకు అందుబాటులో ఉన్నాయి. పెట్రోల్, సీఎన్జీ ఫ్యూయల్ టైం కార్లపై క్యాష్ డిస్కౌంట్ ఇస్తుండగా, అదనంగా అన్ని మోడల్ కార్లపై ఎక్స్చేంజ్, కార్పొరేట్ డిస్కౌంట్లు అందిస్తున్నాయి. పెట్రోల్ వేరియంట్ కారుపై రూ.10 వేలు, సీఎన్జీ వేరియంట్ కారుపై రూ.20 వేల క్యాష్ డిస్కౌంట్, ఎక్స్చేంజ్ బోనస్ రూ.10 వేలు, కార్పొరేట్ డిస్కౌంట్ రూ.3,000 లభిస్తుంది.
హ్యుండాయ్ ప్రీమియం హ్యాచ్ బ్యాక్ ‘ఐ20’ మోడల్ కారుపై గరిష్టంగా రూ.20 వేల రాయితీ అందుబాటులో ఉంది. ఈ ఆఫర్లు కేవలం మాగ్నా, స్పోర్ట్జ్ వేరియంట్లపై మీద లభిస్తాయి. క్యాష్ డిస్కౌంట్ రూ.10 వేలు, ఎక్స్చేంజ్ బోనస్ రూ.10 వేలు లభిస్తుంది.
హ్యుండాయ్ అల్కాజర్ కారుపై రూ.20 వేల వరకు ఎక్స్చేంజ్ బోనస్ ఆఫర్ ఉంది. కోనా ఈవీపై మొత్తం క్యాష్ బ్యాక్ రూ.50 వేల డిస్కౌంట్ అందుబాటులో ఉంది. వెన్యూ, క్రెటా, వెర్నా, ఐఓనిక్యూ5పై ఎటువంటి డిస్కౌంట్లు అందుబాటులో లేవు.