Hyundai EXTER | దక్షిణ కొరియా ఆటోమొబైల్ దిగ్గజం హ్యుండాయ్ మోటార్ ఇండియా (Hyundai Motor India) వచ్చేనెల 10న భారత్ మార్కెట్లో ఆవిష్కరించనున్న లేటెస్ట్ ఎస్యూవీ.. హ్యుండాయ్ ఎక్స్టర్ (Hyundai EXTER) ఉత్పత్తి ప్రారంభమైంది. తమిళనాడులోని శ్రీపెరంబుదూర్ ప్రొడక్షన్ యూనిట్లో శుక్రవారం ఉత్పత్తికి శ్రీకారం చుట్టింది.ఇక ఎక్స్టర్ ఫస్ట్ లుక్ బయటకు వచ్చింది. ఎస్యూవీ బాడీ స్టయిల్ కి పాపులారిటీ రావడంతో యువతను లక్ష్యంగా చేసుకుని హ్యుండాయ్ మోటార్ ఇండియా.. ఎక్స్టర్ తీసుకొస్తున్నది.
రేంజర్-ఖాకీ (Ranger-Khaki) రంగులో ఎక్స్టర్ (Hyundai EXTER) తయారవుతున్నది. 700 మందికిపైగా ఫోర్త్ జనరేషన్ రోబోలు, అత్యంత నిపుణులైన హ్యుండాయ్ మోటార్ ఇండియా కార్మికుల ఆధ్వర్యంలో ఎక్స్టర్ ((Hyundai EXTER) కార్ల ఉత్పత్తి ప్రారంభించామని కంపెనీ ఎండీ కం సీఈఓ ఉన్సూ కిమ్ తెలిపారు. మిగతా మోడల్ కార్లతో పోలిస్తే చాలా స్టయిలిష్‌గా ఉంటుంది.
ఎక్స్టర్తో హ్యుండాయ్ నూతన సెగ్మెంట్లోకి ఎంటరవుతున్నది. దీంతో ఎస్యూవీ కార్ల తయారీలో పూర్తిస్థాయిలో విస్తరణకు సిద్ధమైందని ఉన్సూ కిమ్ ఓ ప్రకటనలో తెలిపారు. స్మార్ట్ ఎలక్ట్రిక్ రూఫ్, ఇన్ బిల్ట్ డాష్ కామ్ విత్ డ్యుయల్ కెమెరాలు తదితర ఫీచర్లు ఉన్నాయి. మైక్రో ఎస్యూవీ సెగ్మెంట్లో ఎక్స్టర్ తొలి మోడల్ కానున్నది. బ్లూలింక్ టెక్నాలజీ ద్వారా 60 ప్లస్ కనెక్టెడ్ ఫీచర్లు జత కలుస్తాయని భావిస్తున్నారు. ఈ ఫీచర్లు ఎంట్రీ లెవ్ ఈ, ఎస్ ట్రిమ్ కార్లలో ఆప్షన్‌గా పెట్టుకునే అవకాశం ఉంది.
8-అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ విత్ ఆపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, 10 ప్రాంతీయ భాషల్లో అలెక్సా వాయిస్ కమాండ్, ఓటీఏ, మ్యాప్ అప్డేట్స్ తదితర ఫీచర్లు ఉన్నాయి. ఇంజిన్ 1.2 లీటర్ల నాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ సామర్థ్యంతో ఉంటుంది. ఈ ఇంజిన్ 83 బీహెచ్పీ విద్యుత్, 114 ఎన్ఎం టార్చి వెలువరిస్తుంది. 5-స్పీడ్ మాన్యువల్ లేదా ఏఎంటీ ట్రాన్స్ మిషన్ ఆప్షన్ కలిగి ఉంటుంది. మాన్యువల్ ట్రాన్స్ మిషన్ ఆప్షన్ కల కార్లకు మాత్రమే సీఎన్జీ వేరియంట్ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. ఈ కారు ధర రూ.5.5 లక్షల నుంచి రూ.10 లక్షల మధ్య ఉండొచ్చు.
వివిధ సెగ్మెంట్లలో హ్యుండాయ్ 12 కార్లు విక్రయిస్తున్నది. దేశవ్యాప్తంగా 1348 సేల్స్ పాయింట్లు, 1515 సర్వీస్ పాయింట్లతో కస్టమర్లకు సేవలందిస్తున్నది. 85 దేశాలకు కార్లను ఎగుమతి చేస్తున్నది.