Hyundai Alcazar facelift | దక్షిణ కొరియా ఆటో మేజర్ హ్యుండాయ్ మోటార్ ఇండియా తన మూడు వరుసల పాపులర్ కారు అల్కాజర్ అప్ డేటెడ్ వర్షన్ కారును సోమవారం భారత్ మార్కెట్లో ఆవిష్కరించింది. హ్యుండాయ్ అల్కాజర్ ఫేస్ లిఫ్ట్ (2024) కారును పలు మార్పులో తీసుకొస్తున్నది. అప్ డేటెడ్ హ్యుండాయ్ క్రెటా మాదిరిగానే 2024 హ్యుండాయ్ అల్కాజర్ ఫేస్ లిఫ్ట్ ఫీచర్లు ఉంటాయి. హ్యుండాయ్ అల్కాజర్ ఫేస్ లిఫ్ట్ టర్బో పెట్రోల్ ఇంజిన్ వేరియంట్ ధర రూ.14.99 లక్షల (ఎక్స్ షోరూమ్) నుంచి డీజిల్ ఇంజిన్ వేరియంట్ రూ.15.99 లక్షల (ఎక్స్ షోరూమ్) నుంచి ప్రారంభం అవుతుంది.
హ్యుండాయ్ అల్కాజర్ ఫేస్ లిఫ్ట్ కారు క్వాడ్ బీమ్ ఎల్ఈడీ హెడ్ ల్యాంప్స్ తో వస్తోంది. పెట్రోల్, డీజిల్ వర్షన్ కార్లలో వేర్వేరు గ్రిల్లె డిజైన్లు ఉంటాయి. 18-అంగుళాల మల్టీ స్పోక్ అల్లాయ్ వీల్స్, ఫంక్షనల్ రూఫ్ రెయిల్స్ ఉంటాయి. డ్యుయల్ 10.25 అంగుళాల స్ట్రీన్స్ ఫర్ ఇన్ఫోటైన్మెంట్, ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, కనెక్టెడ్ కార్ టెక్, ఆపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, డ్యుయల్ వైర్ లెస్ చార్జర్స్, టైప్ సీ యూఎస్బీ పోర్ట్స్, పనోరమిక్ సన్ రూఫ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, 8-వే పవర్డ్ ఫ్రంట్ సీట్స్ విత్ టూ లెవెల్స్ ఆఫ్ మెమొరీ ఫంక్షన్ ఫర్ ది డ్రైవర్, డ్యుయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్, వాయిస్ కమాండ్స్, ఓటీఏ అప్ డేట్స్, ఎయిర్ ప్యూరిఫయర్, ఆటో హెడ్ లైట్స్, రెయిన్ సెన్సింగ్ వైపర్స్, అంబియెంట్ లైటింగ్ తదితర ఫీచర్లు జత కలిశాయి.
ఫార్వర్డ్ కొల్లిషన్ వార్నింగ్ అండ్ ఫార్వర్డ్ కొల్లిషన్ అవాయిడెన్స్ అసిస్ట్, లేన్ డిపార్చర్ వార్నింగ్, లేన్ కీప్ అసిస్ట్ అండ్ లేన్ ఫాలోయింగ్ అసిస్ట్, స్మార్ట్ క్రూయిజ్ కంట్రోల్ విత్ స్టాప్ అండ్ గో, లీడింగ్ వెహికల్ డిపార్చర్ అలర్ట్, హై బీమ్ అసిస్ట్, డ్రైవర్ అటెన్షన్ వార్నింగ్, సేఫ్ ఎగ్జిట్ వార్నింగ్, బ్లైండ్ స్పాట్ కొల్లిషన్ వార్నింగ్, బ్లైండ్ స్పాట్ కొల్లిషన్ అవాయిడెన్స్ అసిస్ట్, రేర్ క్రాస్ ట్రాఫిక్ వార్నింగ్, రేర్ క్రాస్ ట్రాఫిక్ కొల్లిషన్ అవాయిడెన్స్ అసిస్ట్, 360-డిగ్రీ కెమెరా, సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ (స్టాండర్డ్) ఐసోఫిక్స్, చైల్డ్ సీట్ మౌంట్స్, ట్రాక్షన్ కంట్రోల్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, లెవల్ 2 అడాస్ ఫీచర్లు ఉన్నాయి.
హ్యుండాయ్ అల్కాజర్ ఫేస్ లిఫ్ట్ కారు రెండు ఇంజిన్ ఆప్షన్లలో లభిస్తుంది. 1.5 లీటర్ల 4-సిలిండర్ టర్బో చార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్, 1.5 లీటర్ల 4-సిలిండర్ టర్బో చార్జ్డ్ డీజిల్ ఇంజిన్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది. ఇంటీరియర్గా నోబుల్ బ్రౌన్, హేజ్ నేవీ కలర్ ఆప్షన్లలో 6 అండ్ 7 -సీటర్ లే ఔట్లలో లభిస్తుంది. కస్టమర్లు అట్లాస్ వైట్, అబ్యాస్ బ్లాక్ పెరల్, రేంజర్ కాకీ, ఫెరీ రెడ్, రోబస్ట్ ఎమరాల్డ్ పెరల్, స్టారీ నైట్, టైటాన్ గ్రే మ్యాట్టె, అట్లాస్ వైట్ విత్ అబ్యాస్ బ్లాక్ రూఫ్ రంగుల్లో లభిస్తుంది. ఆసక్తి గల కస్టమర్లు ఆన్ లైన్ లో గానీ, సమీప డీలర్ వద్ద గానీ.. రూ.25 వేల టోకెన్ సొమ్ము చెల్లించి కారు బుక్ చేసుకోవచ్చు.