హైదరాబాద్, నవంబర్ 10 (నమస్తే తెలంగాణ) : ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన అమెజాన్‌కు ప్రపంచంలోనే అతి పెద్ద కార్యాలయం హైదరాబాద్‌లోనే ఉందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారక రామారావు తెలిపారు. ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా.. గూగుల్ సంస్థ హైదరాబాద్‌లో చేపట్టిన అతి పెద్ద భవన నిర్మాణం గురించి చేసిన ట్విట్‌పై శుక్రవారం కేటీఆర్ స్పందించారు.
అంతర్జాతీయ సంస్థలైన యాపిల్, మెటా, క్వాల్కమ్, మైక్రాన్, నోవార్టిస్, మెడ్‌ట్రానిక్, ఉబర్, సెల్స్‌ఫోర్స్ లాంటి సంస్థల రెండో అతి పెద్ద కార్యాలయాలు నగరంలోనే ఉన్నాయని ఆయన వివరించారు. ఇవి గడిచిన తొమ్మిదేండ్లలో ఇక్కడికి రావడం విశేషమన్న ఆయన.. అందుకే తాను హ్యాపెనింగ్ హైదరాబాద్ అంటానని తెలిపారు.