హైదరాబాద్, మార్చి 16: మానవ రహిత విమానాన్ని(యూఏవీ) అందుబాటులోకి తీసుకొచ్చింది హైదరాబాద్‌కు చెందిన మాగ్నమ్ వింగ్స్. ప్రభుత్వరంగ సంస్థలతోపాటు వాణిజ్య సంస్థల అవసరాలకోసం దీనిని రూపొందించినట్లు కంపెనీ వర్గాలు వెల్లడించాయి. డ్రోన్ల మాదిరిగా ఉండే ఈ వాహనం 5 కిలోల నుంచి గరిష్ఠంగా 60 కిలోల వరకు లోడ్‌ను తీసుకువెళ్ళగలదు. ఇంది గంటకు 30 కిలోమీటర్ల నుంచి 120 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించనున్నది. అలాగే 100 అడుగులు, 400 అడుగులు, 2 వేల అడుగుల ఎత్తులో ప్రయాణించడంతోపాటు ఏకధాటిగా 2 గంటల పాటు ప్రయాణించనున్నదని కంపెనీ సీఈవో అభిరామ్ చావా ఈ సందర్భంగా తెలిపారు. అత్యవసరాలైన వైద్య, త్వరగా పాడయ్యే అహార పదార్థాల రవాణాకు సైతం దీనిని వాడుకోవచ్చునన్నారు. అలాగే డ్రోన్లు పని చేయనిచోట కూడా పనిచేయనున్నది. ఈ యూవీఏలను దేశీయంగా తయారుచేసినట్లు, వీటిలో అత్యధిక భాగాలను ఇక్కడే సేకరించినట్లు చెప్పారు.