హైదరాబాద్, అక్టోబర్ 28: హైదరాబాద్ కేంద్రస్థానంగా పనిచేస్తున్న లివ్లాండ్ ఈ-మొబిలిటీ మరో రెండు ప్రీమియం ఎలక్ట్రిక్ ఏకో-ఫ్రెండ్లీ సైకిళ్లను మార్కెట్కు పరిచయం చేసింది. యూఫోరియా-ఎల్ఎక్స్, నెస్టార్-ఎస్ఎక్స్ పేర్లతో విడుదల చేసిన వీటిని కాలుష్యాన్ని తగ్గించడానికి, చమురు ధరలు పెరగడం, ట్రాఫిక్ కష్టాలకు ఉపశమనం లభించనున్నదని కంపెనీ ఎండీ సురేశ్ పలపర్థి తెలిపారు.
ఎల్సీడీ డిస్ప్లే, శక్తివంతమైన ముందు లైట్, డ్యూయల్ డిస్క్ బ్రేక్స్ కలిగిన ఈ మాడల్ గరిష్ఠంగా గంటకు 25 కిలోమీటర్లు ప్రయాణించనున్నది.