Janaki Pulaparthi | హైదరాబాద్, మార్చి 13: హైదరాబాద్కు చెందిన వ్యాపారవేత్త అకిన్ అనలిటిక్స్ సీఈవో, ఫౌండర్ జానకి పులపర్తి.. ఫోర్బ్స్ 40 అండర్ 40 జాబితాలో చోటు దక్కించుకున్నారు. కృత్రిమ మేధస్సుతో నడిచే డ్రోన్లను తయారు చేసే సంస్థకు ఆమె నాయకత్వం వహిస్తున్నారు.
రక్షణ, వ్యవసాయం, ఇండస్ట్రియల్స్ రంగాల్లో పరిశోధనలు గావించారు. అలాగే 15 వేల మంది స్వయం సహాయక బృందాలకు చెందిన మహిళలకు డ్రోన్ల పైలెట్లుగా తీర్చిదిద్దారు.