న్యూఢిల్లీ, జనవరి 10: స్పోర్ట్స్ బైకుల సంస్థ కవాసాకీ వాహన కొనుగోలుదారులకు శుభవార్తను అందించింది. నూతన సంవత్సరం సందర్భంగా నింజా బైకులపై రూ.2.5 లక్షల వరకు తగ్గింపు ధరతో విక్రయిస్తున్నట్టు ప్రకటించింది. ఈ తగ్గింపు ధరలు ఈ నెల చివరి వరకు అమలులో ఉండనున్నాయని పేర్కొంది.
సంస్థ తీసుకున్న తాజా నిర్ణయంతో నింజా జెడ్ఎక్స్-10ఆర్ మాడల్‌పై రూ.2.5 లక్షల డిస్కౌంట్ ఇస్తున్న సంస్థ..నింజా 1100 ఎస్ఎక్స్ మాడల్‌పై రూ.1.43 లక్షలు, జెడ్ఎక్స్-6ఆర్‌పై రూ.83 వేలు రాయితీ ఇస్తున్నది. దీంతో నింజా జెడ్ఎక్స్-10ఆర్ మాడల్ ధర రూ.18.29 లక్షలకు దిగిరానుండగా, నింజా 1100 ఎస్ఎక్స్ మాడల్ రూ.12.99 లక్షలకు తగ్గనున్నది.