UPI Pay Now Later | ఇంతకుముందు ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల తయారీ సంస్థలు.. కార్ల తయారీ సంస్థలు.. కొన్ని స్పెషలైజ్డ్ ప్రొడక్ట్స్ సంస్థలు.. ‘బై నౌ – పే లేటర్’ ఫార్ములాను ప్రజల్లోకి తీసుకెళ్లాయి.. అలాగే మొబైల్ యాప్స్ ఆధారిత యూపీఐలో కూడా నౌ పే లేటర్ సౌకర్యం తీసుకొచ్చింది ఆర్బీఐ. యూజర్ల బ్యాంకు ఖాతాలో సరిపడా మనీ ఉంటేనే యూపీఐ పేమెంట్స్ చేయొచ్చు. యూపీఐ నౌ పే లేటర్ ఫార్ములా కింద చెల్లింపులు జరుపాలంటే ప్రతి ఖాతాదారుడికి బ్యాంకులు ముందస్తుగా క్రెడిట్ లైన్ నుంచి కొంత మనీ మంజూరు చేస్తాయి.. అలా మంజూరు చేసిన క్రెడిట్ లైన్ నుంచి మనం యూపీఐ నౌ పే లేటర్ ఫార్ములాతో డబ్బు ఖర్చు చేయొచ్చు. ఇందుకోసం సంబంధిత బ్యాంకు ప్రీ-అప్రూవ్డ్ క్రెడిట్ లైన్‌ను కూడా యూజర్లు తమ యూపీఐ యాప్‌కు జత చేసుకోవచ్చు. అసలు ప్రీ-అప్రూవ్డ్ క్రెడిట్ లైన్ అంటే ఏమిటో తెలుసుకుందామా.. !
ముందుగా బ్యాంకులు మంజూరు చేసే క్రెడిట్ ఫెసిలిటీనే ప్రీ-అప్రూవ్డ్ క్రెడిట్ లైన్ అని.. ప్రీ శాంక్షన్డ్ లోన్ అని పిలుస్తారు. ఇది ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యం వంటిదే. గూగుల్ పే, పేటీఎం, మొబిక్విక్ వంటి మొబైల్ యాప్ ఆధారిత యూపీఐ యాప్స్ ద్వారా ఈ ఫెసిలిటీ ఉపయోగించుకోవచ్చు. బ్యాంకులు క్రెడిట్ లైన్ అందించడానికి ముందుగా మీ పర్మిషన్ తీసుకుంటాయి. బ్యాంకులు ఆమోదించాకే యూపీఐ ద్వారా ఆ మనీ ఖర్చు చేయొచ్చు. అలా చేసే ఖర్చుపై నిర్దిష్టమైన లిమిట్ ఉంటుంది. తిరిగి గడువు లోగా వాడుకున్న మొత్తం చెల్లించాలి. కొన్ని బ్యాంకులు ఫ్రీగా క్రెడిట్ లైన్ ఫెసిలిటీ కల్పిస్తే.. మరికొన్ని వడ్డీ వసూలు చేస్తాయి.
ఆర్బీఐ ప్రకటనతో పలు బ్యాంకులు తమ యూపీఐ యూజర్లకు క్రెడిట్ లైన్ ఫెసిలిటీ కల్పించాయి. బ్యాంకులను బట్టి క్రెడిట్ లిమిట్, క్రెడిట్ టైం, వడ్డీ తదితర అంశాలు మారుతూ ఉంటాయి. హెచ్డీఎఫ్సీ బ్యాంకు తన యూజర్లు ఖర్చు చేసే క్రెడిట్ లైన్ బిల్లుపై వడ్డీ వసూలు చేస్తే.. పరిమితికి మించి ఖర్చు చేసిన వారిపై ఐసీఐసీఐ బ్యాంకు సర్వీస్ చార్జీ వడ్డిస్తుంది.