ITR Filing | విదేశాల్లో పెట్టుబడి.. షేర్‌పై ఆదాయం ఏదైనా ఐటీఆర్‌లో వెల్లడించాల్సిందే.. లేకుంటే జరిగేది ఇదే..?!
ITR Filing | విదేశాల నుంచి ఏ రూపంలో ఆదాయం వచ్చినా మీ ఐటీఆర్‌లో ఫైల్ చేయాల్సిందేనని ఆదాయం పన్ను చట్టం చెబుతోంది. లేదంటే హవాలా లావాదేవీలు, బ్లాక్ మనీ చట్టం కింద ఆదాయం పన్ను విభాగం చర్యలు తీసుకుంటుంది.
ITR Filing | గత ఆర్థిక సంవత్సరా (2022-23) నికి ఐటీ రిటర్న్స్ దాఖలు చేసే గడువు దగ్గర పడుతున్నది. ఈ క్రమంలో వ్యక్తిగత మదుపర్లు, వేతన జీవులు ఐటీఆర్ ఫైలింగ్‌లో నిమగ్నమవుతున్నారు. వాటిల్లో సంక్లిష్టతలపై క్లారిటీ కోసం సతమతం అవుతున్నారు. వివిధ రకాల ఐటీఆర్ ఫామ్‌లు, వాటిల్లో ఫైనాన్సియల్ అకౌంటింగ్ షెడ్యూలింగ్‌తో తరుచుగా ఇబ్బందులు పడుతుంటారు. అసలే 2011-12 ఆర్థిక సంవత్సరం నుంచి ఐటీఆర్ ఫామ్స్ లో పన్ను ఎగవేత, హవాలా లావాదేవీలు, ఫైనాన్సియల్ అకౌంటింగ్ షెడ్యూల్లో అంతర్భాగం.
దీని ప్రకారం భారత్‌లో ఉంటున్న పౌరులు తమ దేశీయ, విదేశీ ఆదాయ వనరుల సంగతులన్నీ ఐటీఆర్ ఫైలింగ్‌లో తెలియజేయాల్సిందే. విదేశాల నుంచి వచ్చిన ఆదాయంపైన భారత్‌లో పన్ను వడ్డిస్తారా..? లేదా.. అన్న దాంతో నిమిత్తం లేకుండా విదేశీ ఆస్తులు, ఆదాయం వివరాలను ప్రతి పన్ను చెల్లింపు దారుడు తన ఐటీఆర్‌లో ఫైల్ చేయాల్సిందే. ఎన్నారై అయినా, నాట్ ఆర్డినర్లీ రెసిడెంట్ ఇండివిడ్యూయల్ (ఎన్ఓఆర్) అయినా వివరాలు వెల్లడించాలి గానీ, పూర్తి పత్రాలు సమర్పించాల్సిందే.
భారతీయుల విదేశీ ఆస్తులు, ఆదాయం వివరాల వివరాలను తప్పనిసరిగా వెల్లడించాలని కేంద్రం 2015లో బ్లాక్ మనీ అండ్ ఇంపొజిషన్ ఆఫ్ టాక్స్ యాక్ట్ (Black Money (Undisclosed Foreign Income and Assets) and Imposition of Tax Act, 2015) చట్టం చేసింది. దీని ప్రకారం విదేశీ ఆస్తులు, ఆదాయం వివరాలు రహస్యంగా ఉంచరాదు.
ఐటీఆర్-2, ఐటీఆర్-3లో ఫైనాన్సియల్ అకౌంటింగ్ షెడ్యూల్ ఉంటుంది. దీని ప్రకారం భారతీయులు తమ విదేశీ ఆస్తులు, ఆదాయం వివరాలను తమ ఐటీఆర్ ల్లో గానీ, ఐటీఆర్ 2 లేదా ఐటీఆర్ 3 ఫామ్‌ల్లో తెలియజేయాల్సిందే.
ఫైనాన్సియల్ అక్కౌంటింగ్ షెడ్యూల్లో వెల్లడించాల్సిన అంశాలివే:
భారత్ ఆవల ఏ రూపంలోనైనా.. అంటే షేర్లు, డిబెంచర్లు, జీవిత బీమా పాలసీలు, యాన్యుటి కాంట్రాక్ట్, ఇల్లు వంటి స్థిరాస్తి, ఇతర పెట్టుబడి ఆస్తి
ఓవర్సీస్ సంస్థ నుంచి ఫైనాన్సియల్ లేదా వడ్డీ లబ్ధి. ఉదాహరణకు ఓవర్సీస్ సంస్థలో భాగస్వామి, విదేశీ ప్రైవేట్ ట్రస్ట్ నుంచి లబ్ది.
భారత్ ఆవల ఏదేనీ బ్యాంకు ఖాతా లేదా వాణిజ్య ఖాతాలో సిగ్నేచర్ అథారిటీగా ఉన్నా..
భారత్ ఆవలి కంపెనీల నుంచి డివిడెండ్, వడ్డీ, పెట్టుబడి లబ్ధి ద్వారా వచ్చే ఆదాయం వివరాలు
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pilates | మహిళలు ఆరోగ్యం కోసం.. పైలేట్స్, శక్తి వ్యాయామం.. రెండింటిలో ఏది చేస్తే మేలు..?
Curry Leaves | కూరల్లో కరివేపాకు తీసి పక్కన పెడుతున్నారా? ముఖానికి ఇలా రాస్తే మెరుపు మీ సొంతం!
Vanasamaradhana | వన సమారాధనకు సింగరేణి నుంచి భారీగా తరలిరావాలి
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
Diabetes | డయాబెటిస్తో పళ్లు ఊడిపోతాయా?.. ఈ 6 సమస్యలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

