దేశంలో తెరకెక్కుతున్న మోస్ట్ ఎవైటెడ్ పానిండియా చిత్రాల్లో అల్లు అర్జున్ నటిస్తున్న ‘రాకా’ ఒకటి. అట్లీ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ ఈ పానిండియా చిత్రాన్ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే. మాఫియా నేపథ్యంలో సాగే ఈ సైంటిఫిక్ థ్రిల్లర్‌లో దీపికా పదుకోన్ కథానాయిక. రష్మిక మందన్నా, జాన్వీకపూర్, మృణాళ్ ఠాకూర్ కీలకపాత్రధారులు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం బాలీవుడ్ సూపర్‌స్టార్ అక్షయ్‌కుమార్ ఈ సినిమాలో ఓ ప్రత్యేకపాత్ర చేసేందుకు అంగీకారం తెలిపినట్టు తెలిసింది. వచ్చే షెడ్యూల్ నుంచి ఆయన ఈ సినిమా సెట్స్‌లోకి ఎంట్రీ ఇస్తారట. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రావాల్సివుంది.