Multiple Credit Cards | ఒకటి కంటే ఎక్కువ క్రెడిట్ కార్డులు ఉంటే ఏమవుతుంది?
Multiple Credit Cards | నెలాఖరులోనూ జేబులు తడుముకోకుండా అవసరాలు తీర్చేసుకుంటున్నారు. అల్లావుద్దీన్.. అద్భుతదీపాన్ని నిమిరినట్టు, సగటు మనిషి ప్రతి అవసరానికీ క్రెడిట్ కార్డును స్వైప్ చేయడం అలవాటుగా మార్చుకుంటున్నాడు.
Multiple Credit Cards | చేతిలో చిల్లిగవ్వ లేకున్నా దర్జాగా షాపింగ్ చేస్తున్నారు. ఖాతాలో కాసుల్లేకున్నా కూల్‌గా విహారానికి వెళ్తున్నారు. నెలాఖరులోనూ జేబులు తడుముకోకుండా అవసరాలు తీర్చేసుకుంటున్నారు. అల్లావుద్దీన్.. అద్భుతదీపాన్ని నిమిరినట్టు, సగటు మనిషి ప్రతి అవసరానికీ క్రెడిట్ కార్డును స్వైప్ చేయడం అలవాటుగా మార్చుకుంటున్నాడు. ఆర్థికంగా చీకట్లు ముసురుకున్నప్పుడు క్రెడిట్ కార్డును దారి దీపంగా భావిస్తున్నారు. కానీ, అవసరానికి మించి వాడితే.. ఆ దీపం కాస్తా కొంపకు చిచ్చుపెట్టే అగ్గిరవ్వలా మారుతుంది. ఆ ఇబ్బంది రావొద్దంటే ఇది చదవండి…
‘అవధులు.. అవిచ్ఛిన్నత..’ ఇంటర్ గణిత శాస్త్రంలో ఒక అధ్యాయం. ఇది అర్థమైన వాళ్లు మార్కులు దండిగా కొల్లగొడతారు. అర్థం చేసుకోలేకపోతే గణితంలో పాస్ మార్కులు కూడా గల్లంతయ్యే ప్రమాదం ఉంది. ‘లిమిట్స్ అండ్ కంటిన్యుటీ..’ ఈ సూత్రమే క్రెడిట్ కార్డులకూ వర్తిస్తుంది. లిమిట్ ఉంది కదా అని అవిచ్ఛిన్నంగా వాడితే.. అసలుకే ఎసరొస్తుంది. అవధిని దృష్టిలో ఉంచుకొని వాడుకుంటే.. క్రెడిట్ కార్డు వల్ల అన్నీ ప్రయోజనాలే.
వచ్చిందే తడవుగా.. లేని డబ్బును మనదిగా వాడుకోవడమే క్రెడిట్ కార్డు ఉద్దేశం. దీనివల్ల 45 రోజులపాటు వడ్డీలేని అప్పు వస్తుంది. అయితే, అత్యవసరాల కోసం వాడితే ఏ తప్పూ లేదు. నిత్యావసరాలకు కూడా కార్డుపై ఆధారపడితే మాత్రం ముప్పే! ఒక వ్యక్తి ఆదాయం, సిబిల్ స్కోర్ ఆధారంగా బ్యాంకులు క్రెడిట్ కార్డులు ఇస్తుంటాయి. మనీబ్యాక్, రిడీమ్ పాయింట్స్, ఇతర ఆఫర్లతో ఇవి అందుబాటులో ఉంటున్నాయి. పైగా ఎలాంటి పూచీకత్తూ లేకుండా వీటిని వినియోగదారులకు ఇచ్చేస్తున్నారు. అయితే, వచ్చిందే తడవుగా కార్డును తెగ వాడేస్తున్నారు. గతంలో పదివేల రూపాయలతో ముగిసిపోయే షాపింగ్.. ఇప్పుడు పాతికవేలకు పెంచుకుంటున్నారు. అప్పు అని తెలిసినా.. ‘లిమిట్’ పూర్తయ్యే వరకూ షాపింగ్ కంటిన్యూ చేస్తున్నారు.
తప్పు చేస్తున్నావు మిత్రమా..
క్రెడిట్ కార్డు వాడటం తప్పు కాదు. అయితే, దేనికి వాడుతున్నాం, ఎంతవరకు వాడుతున్నాం అన్నదాని మీదే తర్వాత పరిణామాలు ఆధారపడి ఉంటాయి. కార్డు బిల్లు నిర్దేశించిన గడువులోగా కడితే ఏ ఇబ్బందీ రాదు. కానీ, బిల్లు కట్టలేక.. నెలలకు నెలలు మినిమమ్ బిల్లు కడుతూ ఉంటారు కొందరు. ఈ పరిస్థితి దాకా వచ్చారంటే.. ఆర్థిక వ్యవస్థ ఇబ్బందుల్లో పడినట్లే! మినిమమ్ బిల్లు కట్టడం వల్ల వడ్డీరేటు 40 నుంచి 50 శాతం (ఏడాదికి) వరకు పడుతుందన్న విషయాన్ని అర్థం చేసుకోలేకపోతున్నారు. దీనికితోడు డబ్బు అవసరం రాగానే పెట్రోలు బంకులు, ఇతర దుకాణాల్లో కార్డు స్వైప్ చేసి, వారికి రెండు శాతం కమీషన్ ఇచ్చి డబ్బు తీసుకుంటున్నారు. ఇవి చాలవన్నట్టు నాలుగైదు క్రెడిట్ కార్డులు తీసుకొని ఒకదానితో మరొక కార్డు బిల్లు కడుతూ పరిస్థితి అదుపులోనే ఉందన్న భ్రమల్లో బతికేస్తున్నారు. కానీ, ఇలాంటి అనాలోచిత విధానాల వల్ల క్రెడిట్ కార్డు బిల్లులు కొండలా పెరిగిపోతాయి. ఒకనాటికి బిల్లులు కట్టలేని పరిస్థితి ఏర్పడుతుంది.

గడువు గండం
కార్డు బిల్లులు గడువులోపు కట్టకపోతే.. బ్యాంకు నుంచి ఫోన్లు మొదలవుతాయి. వారికి సమాధానం చెప్పలేక తప్పించుకోవాలనే ఆలోచన పుడుతుంది. మరోవైపు సిబిల్ స్కోర్ పడిపోవడంతో భవిష్యత్తులో గృహరుణం, పిల్లల చదువుకు ఎడ్యుకేషన్ లోన్ రాకుండా పోతుంది. ఇవన్నీ భయపెట్టడానికి చెబుతున్నవి కావు. మనలో చాలామంది ఎదుర్కొంటున్న సమస్యలే! దీనికి పరిష్కారం లేకపోలేదు. గడువులోపు బిల్లు కడితే ఏ ఇబ్బందీ రాదు. వడ్డీ భారమూ పడదు. పెద్దమొత్తంలో వాడుకున్నట్లయితే.. ఈఎమ్ఐగా మార్చుకోవడం మంచిది. అప్పుడు వడ్డీరేటు 15 శాతం వరకు ఉంటుంది. మినిమమ్ కడుతూ 40 శాతం వడ్డీ కట్టడం కన్నా ఇది మంచిదే కదా! అన్నిటికన్నా ముఖ్యం ఈ సమస్యకు స్వీయ నియంత్రణే పరిష్కారమని గుర్తుంచుకోండి!
ఒకటి చాలు
› ఒకే క్రెడిట్ కార్డు కలిగి ఉండటం ఉత్తమం. ఆదాయం మెరుగ్గా ఉన్నట్లయితే రెండోది వాడొచ్చు. అంతకుమించి క్రెడిట్ కార్డులు ఉంటే వెంటనే వాటిని బ్లాక్ చేయించండి. పెండింగ్ బిల్లులకు భయపడి వాటిని బ్లాక్ చేయకపోతే.. ఆర్థికంగా మరింత నష్టపోవడం ఖాయం.
› బ్యాంకర్లు ఫోన్ చేసినప్పుడు స్పందించాలి. అవసరమైతే బ్యాంకు అధికారిని కలిసి పరిస్థితి వివరించాలి. సులభ వాయిదాలు చెల్లించే వీలు కల్పించమని కోరాలి. అంతేకానీ, బిల్లు ఎగ్గొట్టాలని చూడొద్దు.
› రికవరీ ఏజెంట్లు బెదిరించినా, పరుష పదజాలంతో దూషించినా బెంబేలెత్తిపోయి, పరువుపోయిందని అఘాయిత్యాలకు పాల్పడొద్దు. వెంటనే పోలీసులను సంప్రదిస్తే సమస్యకు పరిష్కారం లభిస్తుంది. కోర్టులో మీ ఆర్థిక పరిస్థితి వివరిస్తే.. వాయిదాల పద్ధతిలో బిల్లు కట్టుకునే వెసులుబాటు కల్పించే అవకాశం ఉంటుంది.
– ఎం. రాం ప్రసాద్, సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్
ram@rpwealth.in, www.rpwealth.in
Read More :
“Surety Signature for Bank loan | ష్యూరిటీ సంతకం చేస్తున్నారా.. ఈ కష్టాలు తప్పవు”
“Want to Buy A Car | ఈ కారణాలతో కారు కొనాలని అనుకుంటున్నారా? అయితే ఇంకోసారి ఆలోచించండి”
అప్పులు తీర్చడానికి కొత్త అప్పులు చేస్తున్నారా.. అయితే ఇలా బయటపడండి
Read Today's Latest Business News in Telugu and Telugu News
- Tags
- banks
- cibil score
- credit card
RELATED ARTICLES
తాజా వార్తలు
Palamuru Rangareddy Lift Irrigation | కాంగ్రెస్ సర్కార్ అలసత్వం.. పాలమూరు- రంగారెడ్డి మోటార్లు బంద్
Riteish Deshmukh | రామ్ పోతినేని ‘RAPO 23’ టీంలోకి రితేశ్ దేశ్‌ముఖ్
Amazon Jobs | ఆ చట్టం అమల్లోకి వస్తే.. అమెజాన్‌లో మళ్లీ ఉద్యోగాల కోత.. ?
smit machchhar | ఆ విషయం నాకు నిజంగా తెలియదు : కెప్టెన్ స్మిత్ మచ్చర్
Congress Leaders | బతుకమ్మ పండుగ వేళ.. కాంగ్రెస్ నేతల డిష్యుం డిష్యుం
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

