రాపో ప్రపంచంలోకి రితేశ్ దేశ్‌ముఖ్
హీరో రామ్ పోతినేని స్వీయ దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం ‘RAPO 23’(వర్కింగ్ టైటిల్). దర్శకునిగా రామ్ డెబ్యూ సినిమా కావడంతో దాదాపు వందకోట్ల నిర్మాణ వ్యయంతో నిర్మాత కృష్ణ పోతినేని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఈ సినిమా చిత్రీకరణ జరుపుకుంటున్నది.
హీరో రామ్ పోతినేని స్వీయ దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం ‘RAPO 23’(వర్కింగ్ టైటిల్). దర్శకునిగా రామ్ డెబ్యూ సినిమా కావడంతో దాదాపు వందకోట్ల నిర్మాణ వ్యయంతో నిర్మాత కృష్ణ పోతినేని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఈ సినిమా చిత్రీకరణ జరుపుకుంటున్నది. ఇదిలావుంటే.. ఇందులోని ఓ కీలక పాత్రను బాలీవుడ్ నటుడు రితేశ్ దేశ్‌ముఖ్ పోషిస్తున్నారు. రీసెంట్గా ఈ సినిమా షూటింగ్లో కూడా ఆయన పాల్గొన్నట్టు చిత్రబృందం సోమవారం ఓ ప్రకటన ద్వారా తెలియజేసింది.
ఏక్ విలన్, రైడ్ 2, రాజా శివాజీ చిత్రాలతో అద్బుతమైన నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న రితేష్ దేశ్‌ముఖ్ తమ సినిమాలో భాగం కావడం పట్ల చిత్రబృందం ఆనందం వెలిబుచ్చింది. ఈ సందర్భంగా షూటింగ్ లొకేషన్లో తీసిన ఓ వీడియోను కూడా విడుదల చేశారు. సినిమా కోసం నిర్మించిన భారీ సెట్నీ, రితేశ్ దేశ్‌ముఖ్ సెట్లోకి అడుగుపెడుతున్న దృశ్యాలను ఈ వీడియో పొందుపరిచారు. ఈ సినిమా ఓ సరికొత్త ప్రపంచాన్ని ఆవిష్కరిస్తుందని, రితేష్ పాత్ర విభిన్నంగా ఉంటుందని మేకర్స్ చెబుతున్నారు. సంయుక్త మీనన్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: తిరునవుక్కరసు, సంగీతం: సామ్ పీఎస్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

