ITR-V Status | మీరు ఆన్లైన్లో ఇన్‌కం టాక్స్ రిటర్న్ (ఐటీఆర్) గురించి తెలుసుకోలేరా.. అయితే బ్యాంక్ లేదా డీమాట్ ఖాతా ద్వారా ఆధార్ ఓటీపీ, ఎలక్ట్రానిక్ వెరిఫికేషన్ కోడ్ (ఈవీసీ)తో తెలుసుకోవచ్చు. అటుపై ఐటీఆర్-5 ఫామ్‌ను బెంగళూరు ఇన్‌కం టాక్స్ సెంట్రల్ ప్రాసెసింగ్ సెంటర్‌కు పోస్టులో పంపాల్సి ఉంటుంది.ఎవరైనా వ్యక్తి ఐటీఆర్-వీ ప్రింటవుట్ తీసుకుని సంతకం చేసిన ప్రతిని ఆదాయం పన్నుశాఖకు పంపాలి. కర్ణాటక రాజధాని బెంగళూరులోని ఐటీ సెంట్రల్ ప్రాసెసింగ్ సెంటర్ (సీపీసీ), పోస్ట్ బాక్స్ నంబర్-1, ఎలక్ట్రానిక్ సిటీ పోస్టాఫీసు అడ్రస్‌కు పంపాల్సి ఉంటుంది. ఫైలింగ్ పూర్తయిన 120 రోజుల్లో ఐటీఆర్‌ను తప్పనిసరిగా వెరిఫై చేసుకోవాలి.
ఒకవేళ మీరు ఫిజికల్ మెథడ్‌లో మీ ఐటీఆర్‌ను వెరిఫై చేసుకుంటే ఆ పత్రాలను సకాలంలో ఆదాయం పన్నుశాఖకు పంపాల్సి ఉంటుంది. ఫైలింగ్ తర్వాత 120 రోజుల్లో మీ రిటర్న్ వెరిఫై కాకుంటే ఐటీఆర్ ఫైలింగ్ ప్రక్రియ పూర్తి కానట్లే. ఐటీ చట్టం ప్రకారం అన్‌వెరిఫైడ్ ఐటీఆర్.. చెల్లుబాటు కాదని ఆదాయం పన్నుశాఖ అధికారులు చెబుతున్నారు. వెరిఫైడ్ ఐటీఆర్ ఫైల్ చేస్తేనే మీకు ఐటీ రీఫండ్ అవుతుంది.ఒకవేళ 120 రోజుల్లో వెరిఫై చేయకుంటే మీరు ఐటీఆర్ ఫైల్ చేయలేదని నిర్ణయిస్తారు. కనుక ఐటీఆర్-5 ఫామ్ సకాలంలో ఐటీ శాఖ ప్రాసెసింగ్ సెంటర్‌కు వెళ్లేలా చర్య తీసుకోవాలి. కనుక నూతన ఐటీ పోర్టల్‌లో ఐటీఆర్-5 రిసిప్ట్ స్టేటస్‌ను చెక్ చేసుకోవాలి..
తొలి దశలో https://www.incometax.gov.in/iec/foportal ను సందర్శించాలి.
రెండో దశలో హోంపేజీ కిందకు వెళ్లి.. అవర్ సర్వీసెస్ సెక్షన్లో ఇన్‌కం టాక్స్ రిటర్న్ (ఐటీఆర్) స్టేటస్‌ను సెలెక్ట్ చేయాలి.
మూడో దశలో స్క్రీన్‌పై నూతన పేజీ వస్తుంది. ఐటీఆర్ ఫైలింగ్‌లో పేర్కొన్న మొబైల్ నంబర్‌ను, ఎకనాలెడ్జ్మెంట్ నంబర్‌ను పిల్ చేయాలి. అటుపై మొబైల్ ఫోన్‌కు ఓటీపీ వస్తుంది. ఇది 15 నిమిషాలు మాత్రమే చెల్లుబాటవుతుంది. ఓటీపీ ఎంటర్ చేశాక సబ్మిట్ క్లిక్ చేయాలి.
సక్సెస్‌ఫుల్‌గా ఓటీపీ ఎంటర్ చేస్తే.. ఐటీఆర్ ఫైలింగ్ కరంట్ స్టేటస్ తెలుపుతుంది. ఆదాయం పన్నుశాఖకు ఐటీఆర్-5 వెళితే.. ఐటీఆర్ వెరిఫైడ్ అని వస్తుంది. లేకపోతే పెండింగ్‌లో ఈ-వెరిఫికేషన్ అని వస్తుంది. ఐటీఆర్-5 రిసీవ్ చేసుకున్న తర్వాత ఆదాయం పన్నుశాఖ మీ ఈ-మెయిల్ అడ్రస్‌కు గానీ, మీ మొబైల్ నంబర్‌కు గానీ కన్ఫర్మ్ అయినట్లు మెసేజ్ వస్తుంది. ఐటీఆర్ వెరిఫైయింగ్ తర్వాత ఐటీఆర్ ప్రాసెసింగ్ మొదలవుతుంది. ఐటీఆర్ ప్రాసెస్ పూర్తయిన తర్వాత ఆదాయం పన్నుచట్టంలోని 143 (1) సెక్షన్ ప్రకారం ఇంటిమేషన్ నోటీస్ వస్తుంది.