న్యూఢిల్లీ, జూన్ 20: క్రెడిట్ కార్డుల ద్వారా జరిపే విదేశీ ఖర్చులు ఎందుకోసం చేశారో బ్యాంక్‌లు/కార్డు జారీ సంస్థలకు వినియోగదారులు డిక్లరేషన్ ఇచ్చే ప్రతిపాదనను ఆదాయపు పన్ను శాఖ చురుగ్గా పరిశీలిస్తున్నది. క్రెడిట్ కార్డులతో వివిధ ఖర్చులకు రెండు విధాలుగా టాక్స్ డిడెక్షన్ ఎట్ సోర్స్ (టీసీఎస్) వర్తిస్తుంది. ఈ పన్ను విధింపు కోసం డిక్లరేషన్ ఇవ్వాలన్న నిబంధనను ప్రవేశపెట్టేందుకు రిజర్వ్‌బ్యాంక్, ఇతర భాగస్వామ్యవర్గాలతో ఐటీ శాఖ చర్చిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. వైద్య, విద్యా అవసరాలకు క్రెడిట్ కార్డులతో జరిపే చెల్లింపులపై 5 శాతం టీసీఎస్, ఇతర వ్యయాలకు 20 శాతం టీసీఎస్ విధిస్తారు. ఈ టీసీఎస్ నిబంధన జూలై 1 నుంచి అమలులోకి వస్తుంది.