పవర్ బ్యాంక్ కొంటున్నారా.. అయితే.. !

న్యూఢిల్లీ: గతంతో పోలిస్తే తాజాగా మార్కెట్లో అందుబాటులో ఉన్న స్మార్ట్ ఫోన్లలో అధునాతన టెక్నాలజీతో రూపుదిద్దుకున్న అత్యంత అధిక సామర్థ్యం గల బ్యాటరీలు ఏర్పాటు చేస్తున్నారు. కానీ, ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్ వాడకం విపరీతంగా పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో మన బ్యాటరీ తొందరగా చార్జింగ్ అయిపోవడం సాధారణమైంది.
ప్రత్యేకించి ప్రయాణం చేసేవారిని స్మార్ట్ ఫోన్ చార్జింగ్ సమస్య వేధిస్తూ ఉంటుంది. కాబట్టి ప్రయాణం చేసేవారు తమ వెంట తప్పనిసరి పరిస్థితుల్లో పవర్ బ్యాంక్ తీసుకెళ్తుంటారు. అయితే, ఈ పవర్ బ్యాంక్ కొనుగోలు చేసేముందుకు కొన్ని ముఖ్యాంశాలను పరిగణనలోకి తీసుకోవాలి.
పవర్ బ్యాంక్ కంపెనీలు భారీ సామర్ధ్యం ఉన్న పవర్ బ్యాంక్‌లను కొనుగోలు చేయాలని ఇచ్చే ఉచిత సలహాల బుట్టలో పడిపోవద్దు. మనం వాడుతున్న స్మార్ట్ ఫోన్లో బ్యాటరీ సామర్థ్యాన్ని బట్టి పవర్ బ్యాంక్ కొనుగోలు చేయడం ఉపయుక్తంగా ఉంటుంది.
ఉదాహరణకు స్మార్ట్ ఫోన్ బ్యాటరీ సామర్ధ్యం 4000 ఎంఏహెచ్ ఉంటే 10,000 ఎంఏహెచ్ సామర్ధ్యం గల పవర్ బ్యాంక్ తీసుకుంటే సరిపోతుంది. ఇందులో 20 శాతం ఔట్ పుట్ తక్కువగా వస్తుంది. ఇక అధిక సామర్థ్యం గల పవర్ బ్యాంకులు కొనే విషయంలో వాటి కొలతలు, బరువు, ఆకారం వంటి లక్షణాలను పరిగణనలోకి తీసుకోవాలి.
పవర్ బ్యాంక్ కొనేముందు ఎంత ఫాస్ట్‌గా ఛార్జ్ అవుతుందో చూడాలి. అంతేకాదు పవర్ బ్యాంక్ నుంచి స్మార్ట్‌ఫోన్‌కు ఎంత ఫాస్ట్‌గా స్మార్ట్‌ఫోన్ ఛార్జింగ్ అవుతుందో కూడా చెక్ చేయాలి. సర్క్యుట్ ప్రొటెక్షన్ కూడా ఉండేలా చూసుకోవడం మంచిది.
ఫాస్ట్ ఛార్జింగ్ చేసే అడాప్టర్ ఉపయోగిస్తే పవర్ బ్యాంక్ త్వరగా ఫుల్ అవుతుంది. మీరు ఫోన్ కొన్నప్పుడు వచ్చిన ఫాస్ట్ ఛార్జర్‌తో పవర్ బ్యాంక్ ఛార్జ్ చేయొచ్చు. పవర్ బ్యాంక్ రోజూ వాడవసరం లేదు. మీకు ఎలక్ట్రిసిటీ అందుబాటులో ఉన్నప్పుడు నేరుగా మీ స్మార్ట్‌ఫోన్ ఛార్జ్ చేయడం మంచిది.
ఎల్ఈడీ ఇండికేటర్ లేదా డిజిటల్ డిస్ప్లే ఉన్న పవర్ బ్యాంక్ తీసుకోవాలి. దీని వల్ల పవర్ బ్యాంక్ ఫుల్ ఉందా? ఎంత శాతం ఛార్జింగ్ అయిపోయింది? అన్న వివరాలు తెలుస్తాయి. పవర్ బ్యాంకులో నాలుగు ఎల్ఈడీ లైట్స్ ఉంటాయి. ఒకే ఎల్ఈడీ లైట్ వెలుగుతుందంటే పవర్ బ్యాంక్ దాదాపుగా ఖాళీ అయినట్టే. పూర్తిగా ఖాళీ కాకముందే పవర్ బ్యాంక్ ఛార్జ్ చేయాలి. అన్ని ఎల్ఈడీలు వెలుగుతున్నాయంటే పవర్ బ్యాంక్ ఫుల్ ఛార్జ్ అయినట్టే.
మనం పవర్ బ్యాంక్ లను కొనే ముందు బ్రాండెడ్ గల కంపెనీలను ఎంచుకుంటే మంచిది. ఎందుకంటే అవి ఛార్జ్ సమయం, బ్యాటరీ మన్నిక, ఫాస్ట్ ఛార్జర్ సపోర్ట్, ఛార్జింగ్ స్పీడ్, బిల్డ్ క్వాలిటీ వంటి విషయాలలో కొంచెం నాణ్యతను పాటిస్తాయి. నకిలీ కంపెనీల నుండి అసలు తీసుకోకుంటే మంచిది.
ఛార్జింగ్ సదుపాయం లేనప్పుడే పవర్ బ్యాంక్ ఉపయోగించాలి. ఓ పవర్ బ్యాంకును రెగ్యులర్‌గా కాకుండా అప్పుడప్పుడు ఉపయోగిస్తే ఏడాదిన్నర నుంచి రెండేండ్లు ఉంటుంది. రెగ్యులర్‌గా వాడితే మాత్రం ఏడాదికో పవర్ బ్యాంక్ తప్పనిసరి మార్చాల్సిందే.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Lulu jobmela | ఈ నెల 27న జాబ్ మేళా.. వివరాలివే
MP Damodar Rao | ఎంపీ దీవకొండ దామోదర్ రావుకు కేసీఆర్ పుట్టినరోజు శుభాకాంక్షలు
Punjab | టోల్ ఫీ తప్పించుకునే యత్నంలో కారు బీభత్సం..!
Potassium | వ్యాయామం చేస్తున్నారా.. పొటాషియం ఉండే వీటిని తింటే మేలు..
Anant Singh expelled | ఎమ్మెల్యే అనంత్ సింగ్‌ను.. పార్టీ నుంచి బహిష్కరించిన జేడీ(యూ)
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

