Honor Magic 6 Pro | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ హానర్ తన హానర్ మ్యాజిక్ 6, హానర్ మ్యాజిక్ 6 ప్రో ఫోన్లు త్వరలో భారత్ మార్కెట్లో ఆవిష్కరించనున్నది. వీటితోపాటు ఫ్రీ ఇయర్ బడ్స్, స్మార్ట్ వాచ్, ఫోన్ కవర్ కూడా ఆవిష్కరిస్తుంది హానర్. హానర్ మ్యాజిక్ 6 సిరీస్ ఫోన్ క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 3 ఎస్వోసీ చిప్ సెట్ పై పని చేస్తుందని భావిస్తున్నారు.
ఈ-కామర్స్ ప్లాట్ ఫామ్ ‘అమెజాన్’లో లిస్టయిన వివరాల మేరకు హానర్ మ్యాజిక్ 6 ప్రో ఫోన్ బ్లాక్ కలర్ ఆప్షన్‌తో 12 జీబీ ర్యామ్ విత్ 512 జీబీ స్టోరేజీ వేరియంట్ వస్తుంది. హానర్ వాచ్ జీఎస్3, హానర్ చాయిస్ ఎక్స్5 ప్రో ఇయర్ బడ్స్, హానర్ ప్రీమియం ఫోన్ కవర్, వీఐపీ కేర్ ప్లస్ సర్వీస్ తదితరాలతో గిఫ్ట్ బండిల్ తో వస్తోందీ హానర్ మ్యాజిక్ 6 ప్రో.
హానర్ మ్యాజిక్ 6 ప్రో ఫోన్ 6.8 అంగుళాల ఫుల్ హెచ్డీ+ (1280x 2800 పిక్సెల్స్) ఓలెడ్ డిస్ ప్లే, 180 మెగా పిక్సెల్ పెరిస్కోప్ సెన్సర్, రెండు 50-మెగా పిక్సెల్ సెన్సర్ కెమెరాలతో కూడిన ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఈ ఫోన్ 80వాట్ల ఫాస్ట్ చార్జింగ్, 66వాట్ల వైర్ లైస్ చార్జింగ్ మద్దతుతో 5600 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ కలిగి ఉంటుంది. ఇంకా ఐపీ68 రేటింగ్ ఫర్ డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ కెపాసిటీ కలిగి ఉంటుంది.
గత జనవరిలో చైనా మార్కెట్లో ఆవిష్కరించిన హానర్ మ్యాజిక్ 6 ప్రో ఫోన్.. భారత్ మార్కెట్లో జూలైలో ఆవిష్కరిస్తారని తెలుస్తోంది. 12 జీబీ ర్యామ్ విత్ 256 జీబీ స్టోరేజీ వేరియంట్ సుమారు రూ.65 వేలు (5699 చైనా యువాన్లు) పలుకుతుందని భావిస్తున్నారు.