Honda Unicorn 2023 | దేశంలోనే ప్రముఖ టూ వీలర్స్ తయారీ కంపెనీ హోండా మోటార్ సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా (హెచ్ఎంఎస్ఐ) మార్కెట్లోకి ఓబీడీ2-కంప్లియంట్ హోండా యూనికార్న్-2023 (Honda Unicorn 2023) తీసుకొచ్చారు. ఢిల్లీలోని ఎక్స్ షోరూమ్ ధర రూ.1.10 లక్షలుగా నిర్ణయించారు. ప్రత్యేకంగా పదేండ్ల వారంటీ ప్యాకేజీతో వస్తున్నది. ఇందులో మూడేండ్లు స్టాండర్డ్ వారంటీ, అటుపై ఏడేండ్ల ఆప్షనల్ ఎక్స్టెండెడ్ వారంటీ ఉంటుంది.
హోండా యూనికార్న్ (Honda Unicorn 2023) బీఎస్-6 ఓబీడీ-2 ప్రమాణాలకు అనుగుణంగా డిజైన్ చేసిన 160సీసీ పీజీఎం-ఎఫ్ఐ ఇంజిన్‌తో వస్తున్నది. ఈ ఇంజిన్ గరిష్టంగా 13.46 పీఎస్ విద్యుత్ 14.58 ఎన్ఎం టార్చి వెలువరిస్తుంది. ఈ ఇంజిన్ 5-స్పీడ్ గేర్‌బాక్స్‌తో రూపుదిద్దుకున్నది.
డైమండ్ టైప్ ఫ్రేమ్, టెలిస్కోపిక్ ఫ్రంట్ సస్పెన్షన్, మోనోసాక్ ఎట్ రేర్ ఆధారంగా హోండా యూనికార్న్ (Honda Unicorn 2023) పని చేస్తుంది. ఇది 18-అంగుళాల అల్లాయ్ వీల్స్, షాడ్ విత్ ట్యూబ్ లెస్ లైర్లతో వస్తుంది. సింగిల్ చానెల్ ఏబీఎస్ విత్ 240 ఎంఎం ఫ్రంట్ డిస్క్, 130 ఎంఎం డ్రమ్ ఎట్ రేర్ కలిగి ఉంటుంది.
ఫ్రంట్‌లో స్మోక్డ్ స్క్రీన్, క్రోమ్ గార్నిష్తోపాటు బ్రాడ్ కౌల్ ఉంటుంది. బిగ్ ట్యాంక్‌పై 3డీ హోండా వింగ్ మార్క్, ట్యాంక్ 13 లీటర్ల పెట్రోల్ సామర్థ్యం కలిగి ఉంటుంది. ఇంజిన్ స్టాప్ స్విచ్ కూడా ఉంటుంది. ఈ బైక్ నాలుగు రంగుల్లో లభ్యం అవుతుంది. పెరల్ ఇగ్నియస్ బ్లాక్, ఇంపీరియల్ రెడ్ మెటాలిక్, మ్యాట్టే యాక్సిస్ గ్రే మెటాలిక్, పెరల్ సిరెన్ బ్లూ కలర్స్‌లో అందుబాటులో ఉంటుంది.