Honda SP160 | ప్రముఖ టూ వీలర్స్ తయారీ కంపెనీ హోండా మోటార్ సైకిల్స్ అండ్ స్కూటర్స్ ఇండియా (హెచ్ఎంఎస్ఐ).. మంగళవారం దేశీయ మార్కెట్లోకి న్యూ ఎస్పీ 160 బైక్‌ను ఆవిష్కరించింది. డిజిటల్ ఇన్ స్ట్రుమెంట్ క్లస్టర్, డ్యుయల్ డిస్క్ బేక్‌తో వస్తోంది. ఈ స్పోర్టీ బైక్ ధర రూ.1.17 లక్షలు (ఎక్స్ షోరూమ)గా నిర్ణయించారు.
హోండా ఎస్పీ 160 స్పోర్టీ బైక్ రెండు వేరియంట్లలో లభిస్తుంది. సింగిల్ డిస్క్ బ్రేక్ వేరియంట్ రూ.1,17,500, డ్యుయల్ డిస్క్ బ్రేక్ వేరియంట్ రూ.1,21,900 (ఎక్స్ షోరూమ్)లకు లభిస్తాయి. ఈ నెలాఖరులో డెలివరీ ప్రారంభిస్తామని హోండా మోటారు సైకిల్స్ అండ్ స్కూటర్స్ ఇండియా తెలిపింది.
160 సీసీ సెగ్మెంట్లో ఇప్పటికే మార్కెట్లో ఉన్న బజాజ్ యమహా ఎఫ్ జడ్ (రూ.1.16 లక్షలు), బజాజ్ పల్సర్ పీ150 బైక్ (రూ.120 లక్షలు), సుజుకి గిగ్జర్ (రూ.1.35 లక్షలు), టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 160 2వీ (రూ.1.19 లక్షలు) తో హోండా ఎస్పీ 160 బైక్ తల పడుతుంది.
హోండా ఎస్పీ 160 బైక్.. యూనికార్న్, ఎక్స్‌బ్లేడ్ మధ్య ఉంటుంది. యూనికార్న్ ట్రెడిషినల్ కంప్యూటర్ బైక్, లుక్స్, స్టైలింగ్‌లో ఎక్స్‌బ్లేడ్ అగ్రెసివ్‌గా కనిపిస్తుంది.
న్యూ హోండా ఎస్పీ 160 బైక్.. మ్యాట్టె డార్క్ బ్లూ మెటాలిక్, పెరల్ స్పార్టాన్ రెడ్, మ్యాట్టె యాక్సిస్ గ్రే మెటాలిక్, పెరల్ ఇగ్నైట్ బ్లాక్, మ్యాట్టె మార్వెల్ బ్లూ మెటాలిక్, పెరల్ డీప్ గ్రౌండ్ గ్రే కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.
మస్క్యులర్ ట్యాంక్ డిజైన్ విత్ వైడ్ ష్రౌడ్స్, ఎయిరోడైనమికల్లీ ప్రొఫైల్డ్ అండర్ కౌల్, సింగిల్ పీస్ సీట్, సింగిల్ గ్రాబ్ రెయిల్, సైడ్ స్లంగ్ ఎగ్జాస్ట్ మఫ్లర్ విత్ క్రోమ్, హెచ్-షేప్డ్ ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్స్ తదితర ఫీచర్లు ఉంటాయి.
హోండా ఎస్పీ 160 బైక్ ఎయిర్ కూల్డ్ 162.7 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్‌తో వస్తుంది. ఈ ఇంజిన్ 7500 ఆర్పీఎం వద్ద గరిష్టంగా 13.5 హెచ్‌పీ విద్యుత్, 14.6 ఎన్ఎం టార్చి వెలువరిస్తుంది. రెండో దశ బీఎస్-6 ప్రమాణాలకు అనుగుణంగా రూపుదిద్దుకున్న ఈ బైక్ ఈ-20 పెట్రోల్‌తోనూ పని చేస్తుంది. 5-స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ కలిగి ఉంటుంది.
పూర్తిగా డిజిటల్ ఎల్సీడీ ఇన్స్ట్రుమెంట్ డిస్ ప్లే విత్ స్పీడో మీటర్, ఓడో మీటర్, క్లాక్, సర్వీస్ ఇండికేటర్, గేర్ పొజిషన్ ఇండికేటర్, సైడ్ స్టాండ్ ఇండికేటర్, ఫ్యుయల్ గాజ్, మైలేజ్, ఫ్యుయల్ గాజ్, ఇంజిన్ స్టార్ట్ లేదా స్టాప్ స్విచ్ అండ్ హజార్డ్ స్విచ్ తదితర ఫీచర్లు కలిగి ఉంటుంది.
సౌకర్యవంతమైన రైడింగ్ కోసం బైక్ ఫ్రంట్‌లో సంప్రదాయ టెలిస్కోపిక్ ఫోర్స్ షాకర్, రేర్‌లో మోనో షాక్ అబ్జార్బర్ ఉంటాయి. 276 ఎంఎం ఫ్రంట్ డిస్క్, 220 రేర్ డిస్క్ బ్రేక్స్ విత్ సింగిల్ చానెల్ ఏబీఎస్ కలిగి ఉంటాయి. ఈ బైక్ 17-అంగుళాల అల్లాయ్ వీల్స్ కలిగి ఉంటాయి.