న్యూఢిల్లీ, ఏప్రిల్ 16: ప్రముఖ కార్ల తయారీ సంస్థ హోండా కార్స్… కొనుగోలుదారులకు షాకిచ్చింది. చమురుకు సంబంధించిన పైపులో సమస్యలు తలెత్తడంతో 77,954 యూనిట్ల కార్లను రీకాల్ చేస్తున్నట్లు ప్రకటించింది. చమురు సరఫరాలో సమస్యలు తలెత్తడంతో ఇంజిన్ నిలిచిపోవడం లేదా స్టార్ట్ కాకపోవడం వంటివి గుర్తించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. జనవరి 2019 నుంచి సెప్టెంబర్ 2020 మధ్యకాలంలో తయారైన అమేజ్, 4వ జనరేషన్ సిటీ, డబ్ల్యూఆర్-వీ, జాజ్, సివిక్, బీఆర్-వీ, సీఆర్-వీ మోడళ్ళు ఉన్నాయి. వీటిలో అమేజ్ 36 వేల యూనిట్లు కాగా, 20 వేల సిటీ, 8 వేల డబ్ల్యూఆర్-వీ, 6 వేల జాజ్, 5 వేల జాజ్లు ఉన్నాయి.
ఇవీ కూడా చదవండీ…
టెస్లా.. డోంట్ మిస్ గోల్డెన్ చాన్స్!
విమాన సర్వీసుల మార్పుపై ఫీజు రద్దు!
వజ్రాలకు కొవిడ్ దెబ్బ.. అదేం లేదన్న సూరత్ ఇండస్ట్రీ