IPL 2026 : దాదాపు పది నెలలకు పైగా క్రికెట్ మ్యాచ్‌లకు దూరమైన చిన్నస్వామి స్టేడియం(Chinnaswamy Stadium)లో ఐపీఎల్ సందడి నెలకొంది. రేపటితో టోర్నీ షురూ కానున్నందున రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB), సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) ఆటగాళ్లు మైదానంలోకి దిగారు. ఆరంభ పోరులో విజయమే లక్ష్యంగా ఇరుజట్ల క్రికెటర్లు శుక్రవారం నెట్స్‌లో తీవ్రంగా సాధన చేశారు.
నిరుడు జూన్ 4న తొక్కిసలాటల ఘటనతో క్రికెట్ మ్యాచ్‌లకు నోచుకోని చిన్నస్వామి స్టేడియానికి పూర్వవైభవం వచ్చింది. కర్నాటక క్రికెట్ సంఘం అధ్యక్షుడిగా ఎంపికవ్వడమే ఆలస్యం మ్యాచ్‌ల నిర్వహణకు నెలకొన్న అడ్డంకులపై దృష్టి సారించిన వెంకటేశ్ ప్రసాద్ అనుకున్నది సాధించాడు. ప్రభుత్వం నుంచి అనుమతులు తీసుకోవడం, ఏకసభ్య కమిషన్ సూచన మేరకు స్టేడియంలో అవసరమైన నిర్మాణాత్మక మార్పులు చేయడం ద్వారా ఐపీఎల్ సందడికి చిన్నస్వామి సిద్ధమైంది.
The countdown to the first ball is on ⏳
🎥 @RCBTweets and @SunRisers are all set for the #TATAIPL 2026 season opener 👊#RCBvSRH pic.twitter.com/8CHJBoGceB
— IndianPremierLeague (@IPL) March 27, 2026
ఆరంభ మ్యాచ్‌లోనే డిఫెండింగ్ ఛాంపియన్ ఆర్సీబీని రికార్డ్ బ్రేకర్ సన్‌రైజర్స్ హైదరాబాద్ ఢీకొడుతోంది. శనివారం రాత్రి 7:30 గంటలకు మ్యాచ్ జరుగనుంది. అందుకని మ్యాచ్ సన్నద్ధతలో భాగంగా శుక్రవారం ఆర్సీబీ, ఆరెంజ్ ఆర్మీ ఆటగాళ్లు నెట్స్‌లో తీవ్రంగా శ్రమించారు. బ్యాటర్లు భారీ షాట్లు ప్రాక్టీస్‌తో చెమటోడ్చగా.. బౌలర్లు వికెట్టే లక్ష్యంగా బంతులు సంధించారు. అనంతరం ఫీల్డింగ్ చేస్తూ తొక్కిసలాటతో మసకబారిన చిన్నస్వామికి మునపటి కళను తీసుకొచ్చారు.
విరాట్ కోహ్లీ, రజత్ పాటిదార్, జాకబ్ బెథెల్లు బ్యాటింగ్ సాధనతో బిజీగా గడపగా.. ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ హెన్రిచ్ క్లాసెన్, అనికేత్ వర్మ పెద్ద షాట్లతో మేము సిద్దమని చాటారు. విజయంతో టోర్నీని ఆరంభించాలనే కసితో ఉన్న రెండు జట్లలో బోణీ కొట్టేది ఎవరనేది ఉత్కంఠ రేపుతోంది.
One last day of waiting before the world stops to watch 🤩#TATAIPL 2026 starts tomorrow 🏆 pic.twitter.com/bzIcYvnY8o
— IndianPremierLeague (@IPL) March 27, 2026