Honda Hornet 2.0 | ప్రముఖ టూ వీలర్స్ తయారీ సంస్థ హోండా మోటార్ సైకిల్స్ ఇండియా (Honda Motorcycle India) జోరు మీదుంది. న్యూ హార్నెట్ 2.0 (Honda Hornet 2.0) బైక్‌ను దేశీయ మార్కెట్లో ఆవిష్కరించింది. రెండోదశ బీఎస్-6 ప్రమాణాలకు అనుగుణంగా రూపుదిద్దుకున్న హార్నెట్ 2.0 బైక్‌లో న్యూ ఫీచర్లు జత చేసింది. ఈ బైక్ ధర రూ.1.39 లక్షల (ఎక్స్ షోరూమ్) నుంచి ప్రారంభం అవుతుంది. మోటారు సైకిల్ బుకింగ్స్ ప్రారంభం అయ్యాయి. ఫెస్టివ్ సీజన్ నేపథ్యంలో సెప్టెంబర్‌లో డెలివరీ ప్రారంభిస్తామని హోండా మోటార్ సైకిల్స్ తెలిపింది. టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 180 (TVS Apache RTR 180) మోటారు సైకిల్‌తో హోండా హార్నెట్ 2.0 (Honda Hornet 2.0) బైక్ పోటీ పడుతుంది. ఈ మోటారు సైకిల్‌పై 10 ఏండ్ల వారంటీ ఆఫర్ చేస్తోంది. మూడేండ్ల స్టాండర్డ్, ఏడేండ్ల ఆప్షనల్ వారంటీ అందిస్తోంది.
ఎల్ఈడీ హెడ్ లైట్స్, ఫ్యుయల్ ట్యాంకుతోపాటు షార్ప్ బాడీ ప్యానెల్స్, న్యూ గ్రాఫిక్స్‌తో అగ్రెసివ్ లుక్‌తో హోండా హార్నెట్ 2.0 (Honda Hornet 2.0) వస్తోంది. నాలుగు కలర్ ఆప్షన్లలో ఈ బైక్ లభిస్తుంది. మ్యాట్లె యాక్సిస్ గ్రే మెటాలిక్, మ్యాట్టె మార్వెల్ బ్లూ మెటాలిక్, మ్యాట్టె సంగ్రియా రెడ్ మెటాలిక్, పెరల్ ఇగ్నిషియస్ బ్లాక్ కలర్స్‌లో అందుబాటులో ఉంటుంది.
184.4సీసీ సింగిల్ సిలిండర్ ఎయిర్ కూల్డ్ ఇంజిన్‌తో హోండా హార్నెట్ 2.0 (Honda Hornet 2.0) బైక్ వస్తున్నది. ఈ ఇంజిన్ గరిష్టంగా 8500 ఆర్పీఎం వద్ద 17 బీహెచ్పీ విద్యుత్, 6000 ఆర్పీఎం వద్ద 15.9 ఎన్ఎం టార్చి వెలువరిస్తుంది. రెండో దశ బీఎస్-6 ప్రమాణాలకు అనుగుణంగా బైక్ ఇంజిన్ రూపుదిద్దుకుంటుంది. ఈ-20 పెట్రోల్‌తోనూ ఈ బైక్ నడుస్తుంది. 5-స్పీడ్ గేర్ బ్యాక్స్‌తో ఈ బైక్ ఇంజిన్ ట్యూన్ చేశారు. స్పీడ్ తగ్గిస్తున్నప్పుడు హార్డ్ డౌన్ షిప్ట్స్ వద్ద రేర్ వీల్ లాకప్ కాకుండా నిరోధించేందుకు న్యూ అసిస్ట్, స్లిప్పర్ క్లచ్ ఉంటాయి.
కంఫర్టబుల్ రైడింగ్ కోసం అప్‌సైడ్ డౌన్ ఫ్రంట్ ఫోర్క్ ఫీచర్ జత చేశారు. మోనోషాక్ రేర్ సస్పెన్షన్ పొందిన సబ్-200 సీసీ సెగ్మెంట్ తొలి బైక్ హోండా హార్నెట్ 2.0. అల్లాయ్ వీల్స్, స్ప్లిట్ సీట్ సెటప్ ఉంటాయి. ఇక సింగిల్ చానెల్ ఏబీఎస్‌తో డిస్క్ బ్రేక్‌లతో బ్రేక్స్ హ్యాండిల్ చేయొచ్చు.
ఎల్ఈడీ లైటింగ్ సెటప్‌తో వస్తున్న హార్నెట్ 2.0 (Honda Hornet 2.0)లో ఎల్ఈడీ లైటింగ్ సెటప్, హెడ్ ల్యాంప్స్, టెయిల్ ల్యాంప్స్, ఇండికేటర్లు ఉంటాయి. ఇంకా 5-లెవెల్ లైటింగ్ కంట్రోల్‌తోపాటు ఫుల్లీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఉంటుంది. గేర్ స్టేటస్ ఇండికేటర్, సర్వీస్ డ్యూ ఇండికేటర్, ట్రిప్ కంప్యూటర్, స్పీడ్ ఇండికేటర్ వంటి ఫీచర్లు కూడా ఉంటాయి.