టోక్యో, అక్టోబర్ 29 : జపాన్‌కు చెందిన ఆటోమొబైల్ దిగ్గజం హోండా మోటర్ కంపెనీ లిమిటెడ్ తన తొలి ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని ఆవిష్కరించింది. హోండా ఓ ఏ(ఆల్ఫా) పేరుతో విడుదల చేసిన ఈ మాడల్‌ను 2027లో దేశీయ మార్కెట్లోకి విడుదల చేయనున్నట్టు ప్రకటించింది.
టోక్యోలో జరుగుతున్న జపాన్ మొబిలిటీ షో 2025లో ఈ కారును ప్రదర్శించింది. దేశీయ మార్కెట్లోకి విడుదల చేయనున్న తొలి ఈవీ మాడల్ ఇదే కావడం విశేషం. మహీంద్రా బీఈ 6, ఎంజీ జెడ్ఎస్ ఈవీ, హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్, టాటా కర్వ్ ఈవీ మాడళ్లకు పోటీగా సంస్థ ఈ నూతన మాడల్‌ను ప్రవేశపెట్టబోతున్నది.