Honda Elevate | హోండా కార్స్ ఇండియా వాహనాలకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్నది. కంపెనీకి చెందిన సిటీ, అమేజ్ సెడాన్, ఎలివేట్ ఎస్‌యూవీలతో పోటీ కంపెనీలకు అత్యాధునిక ఫీచర్స్‌తో కార్లను మార్కెట్లోకి తీసుకువస్తున్నది. ఈ క్రమంలోనే ఎలివేట్ కొత్త స్పెషల్ అపెక్స్ సమ్మర్ లాంచ్ చేసింది. ఈ స్పెషల్ ఎడిషన్ స్టాండర్డ్ వేరియంట్ కంటే మరింత స్టయిలిష్ లుక్, ఆకర్షణీయమైన కలర్స్‌తో తీసుకువచ్చింది. ఈ సమ్మర్ అపెక్స్ ఎడిషన్ ఎక్స్ షోరూం ధర రూ.12.39లక్షలుగా నిర్ణయించింది. ఈ ధర పరిమిత కాలం వరకు మాత్రమే అందుబాటులో ఉంటుందని హోండా కంపెనీ ప్రకటించింది. ఈ కారు ధర స్టాండర్డ్ వెర్షన్ కంటే దాదాపు రూ.32వేల తక్కువ. ప్రత్యేకత ఏమిటంటే ఈ ఎడిషన్ వీ ట్రిమ్ ఆధారంగా రూపొందించింది.
అలాగే, ఈ ప్రత్యేకమైన అపెక్స్ బ్యాడ్జ్‌లను జోడించింది. డిజైన్పరంగా కొత్త రూపాన్ని తీసుకువచ్చింది. ఈ మార్పులతో సరికొత్త లుక్‌ను అందించనున్నది. అపెక్స్ సమ్మర్ ఎడిషన్‌కు కొత్త తొమ్మిది అంగుళాల ఇన్ఫోటైన్మెంట్ టచ్‌స్క్రీన్ ఈ కారుకు సరికొత్త లుక్‌ను జోడించింది. ఈ స్క్రీన్ 360 డిగ్రీ కెమెరా సపోర్ట్‌ని కలిగి ఉంటుంది. దాంతో పార్కింగ్ సమయంలో మరింత సౌకర్యవంతంగా ఉంటుంది. ఇంటీరియర్ డిజైన్ విషయంలో హోండా మంచి కొత్త ఫీచర్స్‌ను అందిస్తున్నది. బయటి నుంచి చూస్తే దీనికి పియానో బ్లాక్, క్రోమ్ ఫినిషింగ్, అపెక్స్ ఎడిషన్ బ్యాడ్జ్, సైడ్ స్కర్ట్స్ ఉన్నాయి. ఇవి కారుకు ప్రత్యేక రూపునిస్తాయి. ఇంటీరియర్ గురించి చెప్పాలంటే బ్లాక్ అండ్ వైట్ డ్యూయల్-టోన్ ఇంటీరియర్, కొత్త లెదర్ లాంటి ఫినిష్ సీట్లు, డోర్ ట్రిమ్‌లు, సీట్ కుషన్లు, సెవెన్ కలర్ యాంబియంట్ లైటింగ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. డాష్‌బోర్డ్, తలుపులు, సాఫ్ట్ టచ్ మెటీరియల్స్ వాడకంతో కేబిన్ గతానికంటే మరింత ప్రీమియం అనుభూతినిస్తాయి.
సమ్మర్ ఎడిషన్‌ను సాధారణ మోడల్‌కు కాస్మెటిక్ అప్డేట్ మాత్రమే కాకుండా.. టెక్నాలజీ, ఇంటీరియర్‌లో మార్పులు చేసింది. ఇంజిన్ పవర్ అపెక్స్ సమ్మర్ ఎడిషన్‌లో అదే 1.5 లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్‌తో వస్తుంది. ఈ వేరియంట్ ప్రధానంగా బ్లాక్ కలర్ స్కీమ్‌లో అందుబాటులో ఉంటుంది. ప్లాటినం వైట్ పెర్ల్ కలర్ కూడా అందుబాటులో ఉంటుంది. కానీ దీని కోసం రూ.8వేలు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. ప్రీమియం ఎస్‌యూవీని కోరుకునే కస్టమర్లను దృష్టిలో ఉంచుకుని, బడ్జెట్లో కొంచెం రాజీ పడాలనుకునే హోండా ఈ కొత్త ఎడిషన్‌ని తీసుకువచ్చింది. తక్కువ ధర, మరిన్ని ఫీచర్లు, ఆకర్షణీయమైన డిజైన్ మారుతి సుజుకి గ్రాండ్ విటారా, టయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్, కియా సెల్టోస్, హ్యుందాయ్ క్రెటాకి బలమైన పోటీ ఇవ్వనున్నది. ఏప్రిల్‌లో హోండా అమ్మకాలు తగ్గుతాయని అంచనా వేయగా.. ఈ క్రమంలో వాహనదారులను ఆకర్షించి మే నెలల్లో అమ్మకాలను పెంచుకునే లక్ష్యంతో ఈ కొత్త ఎడిషన్‌ను తీసుకువచ్చింది.