Honda CRF1100L Africa Twin | ప్రముఖ ద్విచక్ర వాహనాల కంపెనీ హోండా భారత్‌తోని తన హోండా అడ్వెంచర్ బైక్ సీఆర్ఎఫ్1100ఎల్ (CRF1100L) ఆఫ్రికా ట్విన్ను రీకాల్ కాల్ చేసింది. బైక్‌లో వైరింగ్ సమస్యను గుర్తించింది. ఈ లోపం కారణంగా రైడింగ్ సమయంలో సమస్యలకు కారణమవుతుందని కంపెనీ పేర్కొంది. హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా (HMSI) బైక్ ఎడమ హ్యాండిల్‌బార్ స్విచ్గేర్కు కనెక్ట్ చేయబడిన హార్నెస్ వైర్లో సమస్య ఉందని తెలిపింది. హ్యాండిల్‌బార్ నిరంతరం తిరగడం వల్ల, ఈ వైర్ వంగిపోతుందని.. కాలక్రమేణా ఇది వైర్ జాయింట్ టెర్మినల్ వద్ద ఆక్సీకరణ కారణంగా పవర్ సప్లయ్ సరిగా జరుగదని.. దాంతో హారన్ పని చేయడం ఆగిపోవచ్చని చెప్పింది.
అలాగే, హెడ్‌లైట్‌ని తక్కువ నుంచి హైబీమ్కు మార్చడంలో ఇబ్బంది ఎదురవవచ్చని తెలిపింది. బైక్ వారంటీ ఉందా? లేదా? అన్నదానితో సంబంధం లేకుండా.. అదనపు ఖర్చులు లేకుండానే సమస్యను సరి చేస్తామని హోడా స్పష్టం చేసింది. వచ్చే ఏడాది జనవరి నాల్గోవారం నుంచి దేశవ్యాప్తంగా బిగ్‌వింగ్ టాప్‌లైన్ డీలర్‌షిప్‌లలో సమస్యను సరి చేసే పని మొదలవుతుందని తెలిపింది. రీ కాల్ కస్టమర్ భద్రత, సంతృప్తి కోసం కంపెనీ ప్రాధాన్యం ఇస్తుందని హోండా తెలిపింది. బిగ్‌వింగ్ టాప్‌లైన్ అవుట్లెట్లు ఫోన్, ఇమెయిల్, ఎస్ ఎంఎస్ ద్వారా కస్టమర్లను సంప్రదించనున్నట్లు తెలిపారు. ఆయా బైక్‌ను పరిశీలించి మరమ్మతులు చేసేందుకు ఏర్పాట్లు చేయనున్నట్లు చెప్పింది. అయితే, ఈ రీకాల్ క్యాంపెయిన్‌లో మీ బైక్ ఉందో లేదో తెలుసుకునేందుకు వినియోగదారులు హోండా అధికారిక వెబ్సైట్లో వారి విన్ (VIN) సంఖ్యను ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఏవైనా లోపాలు ఉంటే జాప్యం చేయకుండా సకాలంలో సర్వీస్ అపాయింట్మెంట్ బుక్ చేసుకోవాలని హోండా వినియోగదారులకు సూచించింది.