న్యూఢిల్లీ, జూన్ 20: దేశవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందిన హోండా సిటీ మాడల్ సరికొత్తగా స్పోర్ట్ ఎడిషన్‌గా అందుబాటులోకి వచ్చింది. మధ్యస్థాయి సెడాన్ సెగ్మెంట్‌ను మరింత బలోపేతం చేయడానికి హోండా కార్స్ ఇండియా ఈ నూతన మాడల్‌ను ప్రవేశపెట్టింది. ఈ కారు ధర రూ.14.88 లక్షలు(ఢిల్లీ షోరూంలో)గా నిర్ణయించింది. నూతన డ్రైవింగ్ అనుభవం కోరుకుంటున్న యువతను దృష్టిలో పెట్టుకొని ఈ నయా మాడల్‌ను తీర్చిదిద్దినట్టు, 121 పీఎస్‌ల శక్తినివ్వనున్న ఈ కారు లీటర్ పెట్రోల్‌కు 18.4
కిలోమీటర్ల మైలేజీ ఇవ్వనున్నది. ప్రీమియం క్యాబిన్ పెట్రోల్ సీవీటీ వెర్షన్, అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ వంటి ఫీచర్స్ ఉన్నాయి. ఈ సందర్భంగా కంపెనీ వైస్ ప్రెసిడెంట్ కునాల్ బెహ్లా మాట్లాడుతూ..యువత కోరుకుంటున్న విధంగా ఈ నయా సిటీ స్పోర్ట్ వెర్షన్‌ను తయారు చేసినట్టు చెప్పారు.