న్యూఢిల్లీ, ఆగస్టు 25: ప్రముఖ ద్విచక్ర వాహన సంస్థ హోండా.. దేశీయ మార్కెట్లోకి సరికొత్త టూవీలర్లను తీసుకొచ్చింది. అడ్వెంచర్-ైస్టెల్డ్ కలిగిన ఏడీవీ 160 స్కూటర్‌ను ప్రవేశపెట్టింది. ఈ వాహనం ధర రూ.1.70 లక్షలుగా నిర్ణయించింది. 156.9 సీసీ ఇంజిన్ సామర్థ్యంతో రూపొందించిన ఈ స్కూటర్ లిక్విడ్-కూల్డ్, సింగిల్- సిలిండర్ ఇంజిన్‌తో 16.09 బీహెచ్పీ శక్తినివ్వనున్నది. దానంతటదే స్టార్ట్, స్టాప్ అయ్యే టెక్నాలజీ ఉండటంతో ఇంధనం ఆదా కానున్నదని కంపెనీ వర్గాలు వెల్లడించారు. అలాగే రెబల్ 300పేరిట 286 సీసీ ఇంజిన్ సామర్థ్యంతో ఓ బైక్‌ను పరిచయం చేసింది. దీని ప్రారంభ ధర రూ.2.22 లక్షలుగా నిర్ణయించింది. సంస్థ వెబ్‌సైట్‌పై రూ.5వేల టోకెన్ ఎమౌంట్తో ఈ వాహనాలను బుక్ చేసుకోవచ్చు. అక్టోబర్‌లో డెలివరీలు మొదలవుతాయి.