Honda Activa | బెంగళూరు, నవంబర్ 27 : ఎట్టకేలకు యాక్టివా ఈ-స్కూటర్ మార్కెట్లోకి అందుబాటులోకి రాబోతున్నది. దేశవ్యాప్తంగా ఈ-స్కూటర్లకు పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొని హోండా మోటర్‌సైకిల్ గతంలోనే యాక్టివాను ఈ-స్కూటర్ రూపంలో విడుదల చేయబోతున్నట్లు ప్రకటించింది. జనవరి 1 నుంచి ఈ-స్కూటర్ కోసం బుకింగ్‌లు ఆరంభించనున్న సంస్థ..ఫిబ్రవరి నుంచి డెలివరీ చేయనున్నట్లు ప్రకటించింది. ఇందుకు సంబంధించి బెంగళూరు వేదికగా రెండు రకాలుగా ఈ-స్కూటర్లను ప్రదర్శించింది. యాక్టివా ఈ, క్యూసీ1 పేర్తలో వీటిని విడుదల చేసింది. ధర వివరాలు మాత్రం సంస్థ వెల్లడించలేదు.