గురుగ్రామ్, జనవరి 10: సరికొత్త గ్రాండ్ ఐ10 నియోస్ బుకింగ్స్‌ను హ్యుందాయ్ ఆరంభించింది. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని హ్యుందాయ్ డీలర్‌షిప్‌లలో రూ.11,000 చెల్లించి బుక్ చేసుకోవచ్చని ఓ ప్రకటనలో సంస్థ తెలియజేసింది. సాంకేతికత, రక్షణ, ప్రయాణ అనుభవం ఇలా అన్నింటి విషయాల్లో ఈ కారు ఉన్నతంగా ఉంటుందని ఈ సందర్భంగా హ్యుందా య్ మోటర్ ఇండియా లిమిటెడ్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ తరుణ్ గార్గ్ అన్నారు.
ఇక 4 ఎయిర్ బ్యాగులతోపాటు ఆప్షనల్‌గా 6 ఎయిర్‌బ్యాగుల సదుపాయం ఈ కారులో ఉండగా.. ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్స్, టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్, క్రూయిజ్ కంట్రోల్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటి కంట్రోల్, హిల్ స్టార్ట్ అసిస్ట్ కంట్రోల్ వంటి ఎన్నో సౌకర్యాలున్నాయి. ఇదిలావుంటే ఆరా ఫేస్‌లిఫ్ట్ నయా ఎడిషన్‌ను కూడా హ్యుందాయ్ పరిచయం చేసింది.